సింధు శుభారంభం
ఒడెన్‌స: రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తర్వాత పాల్గొంటున్న తొలి టోర్నమెంట్ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ ఈవెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-14, 21-19తో హీ బింగ్‌జియావో (చైనా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సయాకా సాటో (జపాన్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించారుు.
మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్ 21-15, 21-16తో బున్‌సాక్ పొన్సానా (థాయ్‌లాండ్)పై, ప్రణయ్ 21-13, 19-21, 22-20తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా)పై గెలిచారు. సారుుప్రణీత్ 17-21, 21-19, 15-21తో తనోంగ్‌సక్ సెన్‌సోమ్‌బున్‌సుక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సుమీత్-మనూ అత్రి ద్వయం 10-21, 19-21తో కిమ్ యాస్టప్-్రఆండర్స్ రస్‌ముసెన్ (డెన్మార్క్) జోడీ చేతిలో... మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి-ప్రణవ్ జంట 15-21, 14-21తో జోచిమ్ ఫిషెర్ నీల్సన్-క్రిస్టినా పెడెర్సన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యారుు.