- సింధు పోరాట పటిమపై సర్వత్రా హర్షం
రియో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు ప్రపంచ నంబర్ వన్ స్పెయిన్ క్రీడాకారిణి కెరొలినా మారిన్‌కే వణుకు పుట్టించి వెండి పతకం సాధించడం పట్ల అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. సింధు, కెరొలినా మారిన్‌ల మధ్య శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ‘అనంత’లో అభిమానులు టీవీల ముందు అతక్కుపోయారు. ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఏవిధంగా ఉంటుందో అదే తరహాలో అభిమానులు ఉత్కంఠకు లోనయ్యారు. ఇక జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్థానిక ఇండోర్ స్టేడియంలో ప్రొజెక్టర్ ద్వారా మ్యాచ్‌ను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
జయహో సింధు
అనంతపురం స్పోర్ట్స్: రియో ఒలంపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోటీల్లో సింధు విజయం సాధించాలని పీవీకేకే ఇంజినీరింగ్ విద్యార్థులు ఆకాంక్షించారు. సింధు పేరుతో మానవహారంగా ఏర్పడి జయహో సింధు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువతకు రోల్‌మాడల్
యువతకు సింధు రోల్‌మాడల్. ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫైనల్లో ఓడినా ఒలింపిక్స్‌లో సింధు ఆటతీరు భేష్
– డాక్టర్ జొన్నా సత్యనారాయణ, బ్యాడ్మింటన్ సంఘం
సూపర్ గేమ్
ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా జరిగింది. సింధూ మేడమ్ స్పోర్టింగ్ స్పిరిట్ సూపర్బ్. సింధు బంగారు పతకం కొడుతుందని ఆశించా. అయినా పర్వాలేదు వెండి పతకం సాధించింది. స్పెయిన్ క్రీడాకారిణి కెరొలినా బాగా ఆడింది.
–జోషిత, జాతీయస్థాయి క్రీడాకారిణి
స్ఫూర్తిదాయకం
సింధు విజయం యువతకు స్ఫూర్తిదాయకం. యువత క్రీడల వైపు మొగ్గుచూపేలా ఆమె ఆటతీరు ఉంది. బ్యాడ్మింటన్‌కు మరింత ఆదరణ లభిస్తుంది. బ్యాడ్‌లక్ పొరపాటున బంగారు పతకం మిస్ అయ్యింది. సింధూను ఒలింపిక్ అసోసియేషన్ తరపున సన్మానిస్తాం.
– మచ్చా రామలింగారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
హ్యాట్సాఫ్.. సింధు
Published Fri, Aug 19 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
Advertisement
Advertisement