
సింధు జై ఆకృతిలో సింధును అభినందిస్తున్నీదుపురం విద్యార్థులు
రియో ఒలింపిక్స్‌లో అసమాన ఆటతో రజత పతకాన్ని సాధించి భారతదేశ ప్రతిష్ఠతను ప్రపంచ స్థాయిలో నిలిపిన తెలుగింటి ఆడపడుచు పి.వి.సింధుకు ఇచ్ఛాపురం మండలం ధర్మపురం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అభినందనలు తెలిపారు. ‘సింధు జై’ అక్షరాకృతిలో శనివారం కూర్చొని సింధుపై అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎస్.శంకరరావు నాయుడు,పీస లోహిదాసు సింధు క్రీడా స్ఫూర్తి, ప్రతిభను కొనియాడారు.
– ధర్మపురం(ఇచ్ఛాపురం రూరల్)