
సాయిప్రణీత్ శుభారంభం
కశ్యప్, ప్రణయ్ కూడా ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
బాలిక్‌పాపన్ (ఇండోనేసియా): రియో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. పదో సీడ్ భమిడిపాటి సారుుప్రణీత్, పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సిరిల్ వర్మ, కౌశల్, హర్షిల్ డాని తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సారుుప్రణీత్ 21-18, 13-21, 21-13తో సుబగ్జా రియాంతో (ఇండోనేసియా)పై, కశ్యప్ 21-6, 21-8తో సులిస్తో (ఇండోనేసియా)పై, జయరామ్ 21-8, 21-9తో మైనాకి (ఇండోనేసియా)పై, ప్రణయ్ 16-21, 21-19, 21-14తో హా యంగ్ వూంగ్ (దక్షిణ కొరియా)పై గెలిచారు. సిరిల్ వర్మ 7-21, 9-21తో వీ ఫెంగ్ చాంగ్ (మలేసియా) చేతిలో, కౌశల్ 23-21, 14-21, 13-21తో మేగనంద (ఇండోనేసియా) చేతిలో, హర్షిల్ 18-21, 16-21తో సిమోన్ సాంతొసో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు.
మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగమ్మారుు గద్దె రుత్విక శివాని, తన్వీ లాడ్, పీసీ తులసీ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలయ్యారు. రుత్విక 14-21, 14-21తో హనా రమదిని (ఇండోనేసియా) చేతిలో, తులసీ 12-21, 5-21తో జియో లియాంగ్ (సింగపూర్) చేతిలో, తన్వీ 14-21, 19-21తో రుసెల్లి హర్తావన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో కిడాంబి నందగోపాల్-సాన్యమ్ శుక్లా (భారత్) జంట 10-21, 14-21తో మార్కిస్ కిడో-హెంద్రా గుణవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
గురువారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అజయ్ జయరామ్‌తో కశ్యప్; కాంతాఫోన్ (థాయ్‌లాండ్)తో సారుుప్రణీత్; జూ వెన్ సుంగ్ (మలేసియా)తో ప్రణయ్ తలపడతారు.