ఆరేళ్ల కింద వచ్చిన సినిమాలోని పాట అది. ఆ పాటను మన భారతీయులే మరిచిపోయి ఉంటారు. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం ఆ పాట దుమ్మురేపింది. మెక్సికన్ సింక్రనైజెడ్ స్విమింగ్ బృందం బాలీవుడ్ పాటకు తమ విన్యాసాలు జోడించింది.
బాలీవుడ్ ఐటెం సాంగ్ 'ఐలా రే ఐలా' నేపథ్యంగా తీసుకొని ఈతకొలనులో అద్భుతమైన విన్యాసాలు చేసింది. డ్యుయెట్ టెక్నికల్ రోటిన్ ప్రిలిమినరీ రౌండ్‌లో మెక్సికన్ సింక్రనైజెడ్ స్విమ్మర్లైన కరెమ్ ఆషాష్, నురియా డయోస్‌దాదో ఈ పాటకు తగినట్టు విన్యాసాలు చేస్తూ అలరించారు. అంతేకాకుండా ఫైనల్ ఈ అమ్మాయిల జోడీ క్వాలిఫై అయింది.
Mexican #SynchronisedSwimming team dancing to 'Aila Re Aila' 😄👍🏽💃🏽👯
— atul kasbekar (@atulkasbekar) August 15, 2016
Too Good@akshaykumar @dalermehndi pic.twitter.com/yrGjv4XWzt
2010లో వచ్చిన తన 'కట్టామిట్టా' సినిమాలోని పాటకు మెక్సికన్ అమ్మాయిలు విన్యాసాలు చేయడంతో మురిసిపోయిన అక్షయ్‌కుమార్ వారికి ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. వారి విన్యాసాలు సూపర్‌గా ఉన్నాయని కొనియాడాడు. సినిమా సంగీత దర్శకుడు ప్రీతం కూడా ఇలా తన పాట రియోలో మోగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.