
టీవీలో మ్యాచ్ చూస్తున్న సింధు సోదరి(మధ్యలో)
బ్యాడ్మింటన్ స్టార్ సింధు సోదరి దివ్య
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రియో ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తన అక్క దేశానికి స్వర్ణపతకం సాధించాలని దేవుడిని కోరుకుంటున్నట్లు పీవీ సింధు చెల్లెలు దివ్య తెలిపారు. ఆమె గురువారం నెల్లూరులో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఇంటికి వచ్చారు. సింధు మ్యాచ్‌ని టీవీలో ఉత్కంఠగా తిలకించారు. మ్యాచ్ గెలిచిన అనంతరం శ్రీనివాసులురెడ్డి కుటుంబ సభ్యులతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన సోదరి సింధు ఈ విజయం సాధించడానికి తమ తల్లిదండ్రులు, గోపీచంద్ ప్రోత్సాహమే కారణమని చెప్పారు. ఫైనల్లో కూడా గెలిచి దేశానికి స్వర్ణపతకం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.