
నాకు నీళ్ల సమస్య రాలేదు: కవిత
రియో ఒలింపిక్స్ మారథాన్ సమయంలో తనకు కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని భారత అథ్లెట్ ఓపీ జైషా వాపోయిన సంగతి తెలిసిందే. అయితే అదే మారథాన్‌లో పాల్గొన్న మరో భారత క్రీడాకారిణి కవిత మాత్రం తనకు ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పింది. ‘జైషా ఏం చెప్పిందో, ఎందుకు చెప్పిందో నాకు తెలియదు.
నాకు దాహం అయిన ప్రతిసారీ అందుబాటులో మంచినీళ్లు ఉన్నాయి. ముందు రోజు కూడా మన అధికారులు వచ్చి నాకు ప్రత్యేక డ్రింక్స్ ఏమైనా కావాలా అని అడిగారు. కానీ అవసరం లేదని చెప్పాను’ అని కవిత తెలిపింది. జైషా ఫిర్యాదుపై ఇప్పటికే విచారణ ప్రారంభం కాగా... కవిత చెప్పిన విషయాలు భిన్నంగా ఉండటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరగనుంది.