
హామీ ఇస్తేనే... తిరిగి స్వదేశానికి వెళతా
ఇథియోపియా రజత విజేత లిలెసా
అడిస్ అబబా: రియో ఒలింపిక్స్ వేదికగా తమ దేశ రాజకీయాంశాలపై నిరసన వ్యక్తం చేసిన మారథాన్ రజత పతక విజేత ఫెయిసా లిలెసా ఇథియోపియా వెళ్లేందుకు ససేమిరా అంటున్నాడు. తనకెలాంటి శిక్ష విధించబోమని ప్రభుత్వం నుంచి హామీ లభిస్తేనే తిరిగి వెళతానన్నాడు.
రియోలో మారథాన్ రజతం నెగ్గిన అతను పోడియం వద్ద ఇథియోపియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇదిలావుండగా... 8 పతకాలు గెలిచిన ఇథియోపియా అథ్లెట్లకు స్వదేశంలో ప్రభుత్వ, క్రీడాధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే లిలెసాకు హామీపై వ్యాఖ్యానించేందుకు అధికారులు నిరాకరించారు.