
అస్తానా (కజకిస్తాన్): 22 ఏళ్ల భారత బాక్సర్ లాల్‌బియాకిమా ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన 49 కేజీల విభాగం ఫైనల్లో లాల్‌బియాకిమా 4–1తో హసన్‌బోయ్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను చిత్తు చేశాడు. హసన్‌బోయ్ రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కావడం విశేషం. ఒక డిఫెండింగ్ ఒలింపిక్ విజేతను భారత బాక్సర్ ఓడించడం ఇదే మొదటిసారి. మిజోరాంకు చెందిన లాల్‌బియాకిమా తాజా విజయంతో టోర్నీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు.