బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్ | Sachin presents BMW cars to rio winners | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్

Published Sat, Aug 27 2016 4:58 PM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్ - Sakshi

బీఎండబ్ల్యూ కార్లు అందజేయనున్న సచిన్

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సచిన్ శనివారం రాత్రి నగరానికి చేరుకుని ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆ సందర్భంగా నలుగురు ఒలింపియన్లకు బీఎండబ్ల్యూ కార్లను అందజేయనున్నారు.

రియో ఒలింపిక్స్‌లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, కాంస్య పతక విజేత.. రెజ్లర్ సాక్షి మాలిక్‌లతో పాటు 52 ఏళ్ల తర్వాత దేశం తరఫున జిమ్నాస్టిక్స్‌లో పాల్గొని తృటిలో పతకం చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, సింధు కోచ్ గోపిచంద్‌లకు ఆయన బీఎండబ్ల్యూ కార్లను అందజేయనున్నారు. నగరానికి చెందిన చాముండేశ్వరినాథ్ ఫౌండేషన్ తరపున ఈ బహుమతులను సచిన్ తన చేతుల మీదుగా ప్రదానం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement