సచిన్‌ను పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు జంట.. ఫోటోలు వైరల్‌ | PV Sindhu invites Sachin Tendulkar for her wedding | Sakshi
Sakshi News home page

సచిన్‌ను పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు జంట.. ఫోటోలు వైరల్‌

Published Mon, Dec 9 2024 12:49 PM | Last Updated on Mon, Dec 9 2024 1:21 PM

PV Sindhu invites Sachin Tendulkar for her wedding

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌కు చెందిన‌ వెంకట దత్తసాయి(Venkata DattaSai) అనే వ్య‌క్తితో సింధూ త‌న‌  జీవితాన్ని పంచుకోనుంది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో జ‌ర‌గ‌నుంది.

ఈ నేప‌థ్యంలో కాబోయే దంపతులు భార‌త‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్క‌ర్‌ను క‌లిసి తమ వివాహానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సచిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. త్వరలోనే వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్న వెంకట్‌, సింధు జోడికి శుభాకాంక్షలు. 

మీ ఇద్దరూ జీవితాంతం అద్భుతమైన జ్ఞాపకాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లికి రావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

ఎవరీ వెంకట దత్తసాయి?
హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఫ్లేమ్‌ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు. అంతకంటే ముందు.. ఫౌండేషన్‌ ఆఫ్‌ లిబరల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా పూర్తి చేశారు.

వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్‌ టెక్నాలజీస్‌’ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ సాయి క‌లిసి పనిచేశాడు. అయితే వెంక‌ట సాయి కుటుంబానికి, సింధు ఫ్యామిలీకి ముందుగానే ప‌రిచయం ఉంది. ఈ క్ర‌మంలోనే ఇరు కుటంబాల పెద్ద‌లు వీరిద్దిరి పెళ్లిని నిశ్చయించారు. ఈ విష‌యాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా నిర్దారించారు.
చదవండి: IND vs AUS: ట్రావిస్‌ హెడ్‌, సిరాజ్‌లకు ఐసీసీ షాక్‌!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement