
బీఎండబ్ల్యూ
చెన్నై: లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ చెన్నై ప్లాంటులో తొలిసారిగా తయారు చేసిన 6 సిరీస్ గ్రాన్ టురిస్మో కారు ‘బీఎండబ్ల్యూ 630ఐ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ లైన్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది పెట్రోల్ వేరియంట్ రూపంలో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ.58.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్).
స్థానికంగానే తయారుచేసిన ఈ కారును చెన్నైలోని కేయూఎన్ ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌లో బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో ఈ కారును ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment