
అమెరికన్లు ఇంకెంత ఎగరాలి: వర్మ
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈసారి ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన మీద సెటైర్లు వేశారు. 32 కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికాకు 46 బంగారు పతకాలు వస్తే, 5 కోట్ల జనాభా మాత్రమే ఉన్న దక్షిణ కొరియాకు 9 బంగారు పతకాలు వచ్చాయని ఆయన అన్నారు. అయితే 120 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశానికి మాత్రం ఒకే ఒక్క రజత పతకం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఒక్క రజత పతకం వచ్చినందుకే మనం 'మేరా భారత్ మహాన్' అని అరుస్తూ పైకి, కిందకు ఎగురుతుంటే.. 46 బంగారు, 37 వెండి పతకాలు వచ్చిన అమెరికన్లు ఇంకెంత ఎగరాలని ఆయన ప్రశ్నించారు.
బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో ముగిసిన ఒలింపిక్స్‌లో భారత దేశం ఒక రజత పతకం, ఒక కాంస్య పతకంతో మొత్తం పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో మొత్తం 207 దేశాల తరఫున 11,544 మంది పాల్గొన్నారు. భారత దేశం నుంచి అత్యధికంగా 121 మంది పాల్గొన్నారు.
A 32 crore population US wins 46 gold and a 5 crore population South Korea wins 9 gold nd a 120 crores population india wins 1 silver..Wah!
— Ram Gopal Varma (@RGVzoomin) 22 August 2016
If for one silver we are jumping up and down screaming Mera Bharat Mahan. how high should be Americans jumping for 46 gold and 37 silver
— Ram Gopal Varma (@RGVzoomin) 22 August 2016