బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు బహుమతుల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.3 కోట్ల నగదు, ఏపీ రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కోచ్ గోపిచంద్కు రూ.50 లక్షల బహుమతిని ఏపీ సర్కార్ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లోపు సింధూతో పాటు గోపీచంద్ ను ప్రభుత్వం సన్మానించనుంది. అలాగే సాక్షి మాలిక్ కు రూ.50 లక్షల బహుమతి ప్రకటించింది.