ఒలింపిక్‌ హర్డిల్స్‌ చాంప్‌ రోలిన్స్‌పై నిషేధం | Olympic hurdles ban on roll rolls | Sakshi
Sakshi News home page

ఒలింపిక్‌ హర్డిల్స్‌ చాంప్‌ రోలిన్స్‌పై నిషేధం

Published Sat, Apr 22 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ఒలింపిక్‌ హర్డిల్స్‌ చాంప్‌ రోలిన్స్‌పై నిషేధం

ఒలింపిక్‌ హర్డిల్స్‌ చాంప్‌ రోలిన్స్‌పై నిషేధం

లాస్‌ఏంజిల్స్‌: గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన అమెరికా అథ్లెట్‌ బ్రియానా రోలిన్స్‌పై ఏడాదిపాటు నిషేధం విధించారు. డోపింగ్‌ నిబంధనలు ఉల్లంఘించి... పోటీలు లేని సమయంలో తన ఆచూకీ వివరాలు వెల్లడించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (యూఎస్‌ఏడీఏ) ప్రకటించింది.

ఈ నిర్ణయంతో రోలిన్స్‌ గత ఏడాది సెప్టెంబరు 27 నుంచి సాధించిన ఫలితాలు చెల్లుబాటుకావు. అంతేకాకుండా వచ్చే ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అర్హత కోల్పోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement