33 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు | Parliament Minute To Minute Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాల అప్‌డేట్స్‌..

Published Mon, Dec 18 2023 7:53 AM | Last Updated on Mon, Dec 18 2023 4:03 PM

Parliament Minute To Minute Updates  - Sakshi

33 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

  • లోక్‌సభ నుంచి 33 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు
  • కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి సహా 33 మందిని సస్సెండ్‌ చేసిన స్పీకర్‌
  • వింటర్‌ సెషన్‌ ముగిసే వరకూ సస్పెండ్‌ చేసిన స్పీకర్‌
  • గత వారం 14 మంది ఎంపీలు సస్పెన్షన్‌

జమ్మూ కశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • ఎస్సీ, ఎస్టీ మహిళలకు జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్‌ కల్పించాలని బిల్లు
  • విపక్షాల ఆందోళన మధ్య బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ
  • బిల్లుకు మద్దతు తెలిపిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
  • ఈ బిల్లులో బీసీ మహిళలకు సైతం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి

దాడి ఘటనపై రాజకీయాలా: స్పీకర్‌ ఓం బిర్లా

  • పార్లమెంట్‌పై దాడి ఘటనపై రాజకీయాలా 
  • ఇది చాలా విచారకరం 

రాజ్యసభ మళ్లీ వాయిదా 

  • వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైనా ఆగని ఎంపీల ఆందోళన
  • సభను తిరిగి 2 గంటలకు వాయిదా వేసిన చైర్మన్‌ 
  • పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాల పట్టు 

రాజ్యసభ 11.30 గంటలకు వాయిదా 

  • పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్‌లో రభస 
  • ఉభయ సభల్లో విపక్షఎంపీల ఆందోళన 
  • ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్‌ 
  • లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నానికి వాయిదా

లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా 

  • పార్లెమంట్‌ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాల పట్టు 
  • ఆందోళకు దిగిన ఎంపీలు 
  • ప్రశ్నోత్తరాలకు అడ్డుతగిలిగి నినాదాలు చేసిన విపక్షాల సభ్యులు 
  • సభను మధ్యాహ్నానికి వాయిదా వేసిన స్పీకర్‌

 విపక్షాల ఆందోళన

  • పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్ష ఎంపీల పట్టు 
  • సభలో ఆందోళనకు దిగిన ఎంపీలు 
  • ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న ప్రతిపక్షాలు 
  • సహకరించాలని కోరిన స్పీకర్‌ ఓం బిర్లా 

భద్రతా వైఫల్యంపై ప్రధాని స్టేట్‌మెంట్‌కు డిమాండ్‌ 

  • పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై ‍ ప్రభుత్వం స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సిందే
  • ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్‌ లీడర్ల డిమాండ్‌ 
  • ఉదయం ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే చాంబర్‌లో ఇండియా కూటమి నేతల భేటీ

ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు

  • సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంక స్పీకర్‌ మహింద అభయవర్ధనే
  • స్వాగతం పలికిన స్పీకర్‌ ఓంబిర్లా 

పార్లమెంట్ భద్రతా వైఫల్యం..ఖర్గే చాంబర్‌లో ఇండియా కూటమి నేతల భేటీ 

  • పార్లమెంట్‌లో అలజడి ఘటనపై చర్చిస్తున్న ఇండియా కూటమి నేతలు 
  • పార్లమెంట్‌లో అనుసంచరించాల్సిన వ్యూహంపై కసరత్తు 
  • ఇప్పటికే ఘటనపై వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు

పార్లమెంట్‌లో అలజడి ఘటనపై చర్చించాల్సిందే 

  • పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం సీరియస్‌ అంశం
  • దీనిపై సభలో చర్చించాల్సిందే 
  • బీజేపీ ఎంపీ పాస్‌పై ఆగంతకులు ఎలా వచ్చారు
  • కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి

పార్లమెంట్‌లో అలజడి.. విపక్షాల వాయిదా తీర్మానాలు

  • పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై ఉభయసభల్లో విపక్షాల వాయిదా తీర్మానాలు 
  • హోమ్ మంత్రి సమాధానం చెప్పాలని, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్‌ 
  • 10 గంటలకు ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి నేతల సమావేశం
  • పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న నేతలు 

 పార్లమెంట్‌లో నేడు కీలక బిల్లులు 

  • లోక్ సభలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు
  • బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
  • బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేర్లు మార్పు
  • ఐపీసీకి భారత న్యాయ సంహితగా పేరు  
  • సీఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహిత
  • ఎవిడెన్స్ యాక్టును భారత సాక్ష బిల్లుగా పేరు మార్పు 
  • కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన 
  • దీని వల్ల న్యాయ ప్రక్రియలో  అయోమయం ఏర్పడే అవకాశం ఉందని వాదన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement