new bill
-
బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?
తదుపరి పార్లమెంటు బడ్జెట్ (Budget) సెషన్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లును (new income tax bill) ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టాన్ని సులభ తరం, అర్థమయ్యేలా చేస్తుందని, అలాగే పేజీల సంఖ్యను 60% తగ్గిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.‘ఇది కొత్త చట్టం. ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. ముసాయి దా చట్టాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీ లిస్తోంది. దీనిని బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని తెలిపాయి. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం–1961ని ఆరు నెల ల్లో సమగ్రంగా సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.బడ్జెట్ సెషన్ జనవరి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. మొదటి అర్ధభాగం (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13) ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.పార్లమెంటు మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది. ఐటీ చట్టం 1961 సమగ్ర సమీక్ష కోసం సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రకటన మేరకు సమీక్షను పర్యవేక్షించడానికి, చట్టాన్ని సంక్షిప్తంగా, స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అంతర్గత కమిటీని సీబీడీటీ ఏర్పాటు చేసింది. అలాగే చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 ప్రత్యేక సబ్‌కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. -
Hana-Rawhiti: అట్లుంటది ఆమెతోని..!
‘కాంతారా’ లోని గుండె గుభిల్లుమనే ‘అరుపు’ ఆ సినిమాను చూసిన వారి చెవుల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి అరుపే గురువారం నాడు న్యూజిల్యాండ్ పార్లమెంట్ హాల్లో ప్రతిధ్వనించింది! ఆ దేశ చరిత్రలోనే అతి చిన్న వయసు ఎంపీ అయిన 22 ఏళ్ల హానా రాహిటీ మైపీ–క్లార్క్ కంఠనాళాలను చీల్చుకుంటూ ఒక్కసారిగా బయటికి వచ్చిన అరుపు అది. 123 మంది సభ్యులు గల ఆ నిండు సభను ఒక ఊపు ఊపిన ఆ అరుపు.. మావోరీ ఆదివాసీ తెగల సంప్రదాయ రణన్నినాదమైన ‘హాకా’ అనే నృత్య రూపకం లోనిది! న్యూజీలాండ్ ప్రభుత్వం తీసుకు రాబోతున్న కొత్త బిల్లుకు నిరసనగా, ఆ బిల్లు కాగితాలను రెండుగా చింపి పడేసి, తన సీటును వదిలి రుద్ర తాండవం చేసుకుంటూ పార్లమెంట్ హాల్ మధ్యలోకి వచ్చారు హానా! ఆమెతో జత కలిసేందుకు తమ సీట్లలోంచి పైకి లేచిన మరికొందరు ఎంపీలు ‘హాకా’ డ్యాన్స్ కు స్టెప్పులు వేయటంతో నివ్వెరపోయిన స్పీకర్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేయవలసి వచ్చింది. హానా ‘మావోరీ’ పార్టీకి చెందిన ప్రతిపక్ష ఎంపీ. మావోరీ తెగల హక్కుల పరిరక్షకురాలు. బ్రిటిష్ ప్రభుత్వానికీ, మావోరీలకు మధ్య కుదిరిన 1840 నాటి ‘వైతాంగి ఒప్పందం’ ద్వారా మావోరీలకు సంక్రమిస్తూ వస్తున్న ప్రత్యేక హక్కులను మొత్తం న్యూజీలాండ్ ప్రజలందరికీ వర్తింపజేసేలా మార్పులు చేసిన తాజాబిల్లును మావోరీల తరఫున హానా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకతకు సంకేతంగానే పార్లమెంటులో అరుపు అరిచారు. అధికార పక్షాన్ని ఓ చరుపు చరిచి బిల్లు కాగితాలను చింపేశారు.ఈ ఏడాది జనవరిలో కూడా హానా ఇదే అరుపుతో పార్లమెంటు దద్దరిల్లిపోయేలా చేశారు. అంతకు ముందే డిసెంబరులో కొత్తగా ఏర్పాటైన న్యూజిలాండ్ ప్రభుత్వం తొలి పార్లమెంటు సమావేశం లో... మాతృభాషను నేర్చుకోవాలని తహతహలాడుతున్న మావోరీ పిల్లలకు మద్దతుగా ఆమె దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ‘హాకా’ వార్ క్రై నినాదాన్ని ఇచ్చారు. ‘‘నేను మీ కోసం చనిపోతాను. అయితే నేను మీకోసం జీవిస్తాను కూడా..’’ అని పార్లమెంటు సాక్షిగా ఆమె మావోరీ తెగలకు మాట ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపదేశం అయిన న్యూజీలాండ్‌లో 67.8 శాతం జనాభా ఉన్న యూరోపియన్ ల తర్వాత 17.8 శాతం జనాభాతో మావోరీలే ద్వితీయ స్థానంలో ఉన్నారు. తక్కిన వారు ఆసియా దేశస్తులు, పసిఫిక్ ప్రజలు, ఆఫ్రికన్ లు, ఇతరులు. తాజామార్పుల బిల్లులో అందరినీ ఒకేగాట కట్టేయటాన్ని మావోరీలకు మాత్రమే ప్రత్యేకమైన పెద్దగొంతుకతో హానా ప్రశ్నిస్తున్నారు. -
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పెన్షన్ రద్దు
సిమ్లా: పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి చేరకుండా ఉండేందుకు బుధవారం అసెంబ్లీలో ఓ కొత్త బిల్లును తీసుకువచ్చింది. పార్టీ మారితే ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు చేసేలా ఆ బిల్లును రూపొందించింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో.. సభ్యుల భత్యాలు ,పెన్షన్ (సవరణ బిల్లు)- 2024 పేరుతో నూతన బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు కొత్త బిల్లు ప్రకారం పెన్షన్ రద్దు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏ సమయంలోనైనా ఎమ్మెల్యేలుగా అనర్హతకు గురైతే.. కొత్త బిల్లు ప్రకారం పెన్షన్‌కు అర్హులు కాదు’అని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఈ బిల్లు ప్రస్తావించింది.ఇక..ఫిబ్రవరి 27న హిమచల్ ప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అనంతరం వారంతా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన బిల్లును ఆమోదించింది. -
ముస్లిం వివాహాలు, విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: అసెంబ్లీలో బిల్లు
ముస్లిం వివాహాలు, విడాకుల విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక బిల్లును తీసుకొచ్చింది. ముస్లిం వివాహాలు, విడాకులను రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ రూపొందించిన కొత్త బిల్లును అస్సాం కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.‘అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మార్యేజ్ అండ్ డివర్స్ బిల్లు-2024’ను ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశపెట్టగా.. మెజార్టీ సభ్యుల అంగీకరంతో ఆమోదం పొందింది. దీని ద్వారా బ్యాల వివాహాలను నిషేధించడం వీలవుతుందని సీఎం హిమంత బిస్వ శర్మ పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు ఖాజీలు లేదా మతపెద్దలు ముస్లింల వివాహాలను రిజిస్టర్ చేసేవారని, ఇకపై అలా కుదరదని తెలిపారు. కొత్త బిల్లు ప్రకారం ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా జరుగుతుందన్నారు.కాగా, వధువు 18 ఏళ్లు నిండకపోయినా.. వరుడికి 21 ఏళ్లు రాక ముందే.. ముస్లింల వివాహ నమోదును అనుమతించే నిబంధనలను ముస్లిం వివాహాల చట్టంలో కలిగి ఉంది. అయితే కొత్త చట్టం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ముస్లిం మైనర్ బాలికలు తమ వివాహాన్ని నమోదు చేసుకోలేరని సీఎం తెలిపారు.ఇంతకముందు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేసింది. అయితే ఖాజీ వ్యవస్థను పునరుద్ధరించాలని అస్సాంలోని పలు ముస్లిం సంస్థలు ముఖ్యమంత్రిని అభ్యర్థించాయి. -
33 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు
33 మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు లోక్‌సభ నుంచి 33 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి సహా 33 మందిని సస్సెండ్ చేసిన స్పీకర్ వింటర్ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేసిన స్పీకర్ గత వారం 14 మంది ఎంపీలు సస్పెన్షన్ జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఎస్సీ, ఎస్టీ మహిళలకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని బిల్లు విపక్షాల ఆందోళన మధ్య బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ బిల్లుకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులో బీసీ మహిళలకు సైతం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరిన ఎంపీ విజయసాయిరెడ్డి దాడి ఘటనపై రాజకీయాలా: స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్‌పై దాడి ఘటనపై రాజకీయాలా ఇది చాలా విచారకరం రాజ్యసభ మళ్లీ వాయిదా వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైనా ఆగని ఎంపీల ఆందోళన సభను తిరిగి 2 గంటలకు వాయిదా వేసిన చైర్మన్ పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాల పట్టు రాజ్యసభ 11.30 గంటలకు వాయిదా పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో రభస ఉభయ సభల్లో విపక్షఎంపీల ఆందోళన ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్ లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నానికి వాయిదా లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పార్లెమంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్షాల పట్టు ఆందోళకు దిగిన ఎంపీలు ప్రశ్నోత్తరాలకు అడ్డుతగిలిగి నినాదాలు చేసిన విపక్షాల సభ్యులు సభను మధ్యాహ్నానికి వాయిదా వేసిన స్పీకర్ విపక్షాల ఆందోళన పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై చర్చించాలని విపక్ష ఎంపీల పట్టు సభలో ఆందోళనకు దిగిన ఎంపీలు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న ప్రతిపక్షాలు సహకరించాలని కోరిన స్పీకర్ ఓం బిర్లా భద్రతా వైఫల్యంపై ప్రధాని స్టేట్మెంట్కు డిమాండ్ పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్ లీడర్ల డిమాండ్ ఉదయం ఏఐసీసీ చీఫ్ ఖర్గే చాంబర్లో ఇండియా కూటమి నేతల భేటీ ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలంక స్పీకర్ మహింద అభయవర్ధనే స్వాగతం పలికిన స్పీకర్ ఓంబిర్లా పార్లమెంట్ భద్రతా వైఫల్యం..ఖర్గే చాంబర్లో ఇండియా కూటమి నేతల భేటీ పార్లమెంట్లో అలజడి ఘటనపై చర్చిస్తున్న ఇండియా కూటమి నేతలు పార్లమెంట్లో అనుసంచరించాల్సిన వ్యూహంపై కసరత్తు ఇప్పటికే ఘటనపై వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు పార్లమెంట్లో అలజడి ఘటనపై చర్చించాల్సిందే పార్లమెంట్లో భద్రతా వైఫల్యం సీరియస్ అంశం దీనిపై సభలో చర్చించాల్సిందే బీజేపీ ఎంపీ పాస్‌పై ఆగంతకులు ఎలా వచ్చారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి పార్లమెంట్లో అలజడి.. విపక్షాల వాయిదా తీర్మానాలు పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై ఉభయసభల్లో విపక్షాల వాయిదా తీర్మానాలు హోమ్ మంత్రి సమాధానం చెప్పాలని, బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ 10 గంటలకు ఖర్గే ఛాంబర్లో ఇండియా కూటమి నేతల సమావేశం పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న నేతలు పార్లమెంట్లో నేడు కీలక బిల్లులు లోక్ సభలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు బిల్లులపై చర్చ ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాల పేర్లు మార్పు ఐపీసీకి భారత న్యాయ సంహితగా పేరు సీఆర్పీసీకి భారత నాగరిక సురక్ష సంహిత ఎవిడెన్స్ యాక్టును భారత సాక్ష బిల్లుగా పేరు మార్పు కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన దీని వల్ల న్యాయ ప్రక్రియలో అయోమయం ఏర్పడే అవకాశం ఉందని వాదన -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నాలుగు బిల్లులపై చర్చ?
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు చెల్లుచీటి ఇస్తూ.. వాటి స్థానంలో కొత్త చట్టాలను తేవాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల బిల్లులతో పాటు పెండింగ్‌లో ఉన్న మరో వివాదాస్పద బిల్లును సైతం పరిశీలించే యోచనలో ఉంది కేంద్రం. మొత్తం 12 రోజులపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు కాబోతున్నట్లు సమాచారం. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ముగిశాకనే ఈ సమావేశాలు మొదలుకానున్నాయి. క్రిస్మస్‌లోపు.. అదీ డిసెంబర్ 22 లోపే సమావేశాలు ముగించేయలని భావిస్తోంది కేంద్రం. దీంతో రెండు వారం నుంచి సెషన్ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య చట్టం తీసుకురావాలనుకుంటోంది కేంద్రం. ఇప్పటికే వీటిని కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గత వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా విపక్షాల, మాజీ ఎన్నికల కమీషనర్ల వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఎలక్షన్ కమీషనర్ల హోదాను కేబినెట్ కార్యదర్శికి సమానంగా తీసుకురావాలనేది ఈ బిల్లు ఉద్దేశ్యం. దాంతోపాటు ఎన్నికల కమీషనర్ల నియామక విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కమీషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదా ఉంది. ఈ బిల్లు ఆమోదిస్తే కేబినెట్ సెక్రటరీ హోదా లభిస్తుంది. -
అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు..
ఢిల్లీ: 1860 నాటి భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహిళలపై నేరాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపును దాచిపెట్టి యువతిని వివాహం చేసుకుంటే ఇలాంటి నేరాలకు ఇకపై 10 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా నింబంధనలను పొందుపరిచారు. ఇదే కాకుండా ఉద్యోగం, పదోన్నతి వంటి తప్పుడు వాగ్దానంతో మహిళను వివాహమాడటం లేదా లైంగిక చర్యలకు పాల్పడితే కూడా పదేళ్ల వరకు శిక్ష పడే విధంగా నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల్లో నిబంధనలు పొందుపరిచారు. ఉద్యోగం, పదోన్నతి, వివాహం వంటి అంశాల్లో తప్పుడు వాగ్దానాలతో స్త్రీతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేదు కానీ పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. అత్యాచార ఘటనల్లో.. కొత్త న్యాయ చట్టాల ప్రకారం గ్యాంగ్‌రేప్ నేరంలో దోషికి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడిగడితే మరణిశిక్ష ఉంటుంది. అత్యాచారంలో బాధితురాలు మరణిస్తే.. 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష, జీవితకాలం లేదా మరణశిక్ష పడే అవకాశాలను చట్టంలో సూచించారు. 12 ఏళ్లలోపు బాలలపై రేప్ ఘటనల్లోనూ ఇదే తరహా శిక్షలు అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా శుక్రవారం పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ -
పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!
గాంధీనగర్: పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలను కట్టడి చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా, ఏ అధికార హోదాలో ఉన్నవారైనా సరే ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించేలా కొత్త రూల్ తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లు 'ది గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)- 2023'ను గుజరాత్ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. ఈ ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం గమనార్హం. ఈ కొత్త రూల్ ప్రకారం పేపర్ లీక్ వ్యహారంతో సంబంధం ఉన్న వారు, దోషులను రెండేళ్ల పాటు ఎలాంటి పోటీ పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తారు. అలాగే ఏదైనా సంస్థ పేపర్ లీక్‌కు పాల్పడితే జీవితకాలం నిషేధిస్తారు. అవసరమైతే వారి అస్తులను విక్రయించి పరీక్ష ఖర్చులను వసూలు చేస్తారు. అయితే ఈ నిబంధనలు పోటీ పరీక్షలకు మాత్రమే వర్తిస్తాయి. 10, 12వ తరగతి, యూనివర్సిటీ పరీక్షలకు వర్తించవు. పేపర్ లీక్ అయిన కారణంగా ఈ ఏడాది జనవరిలో పంచాయత్ జూనియర్ క్లర్క్ రిక్రూట్మెంట్ పరీక్షను గుజరాత్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రశ్నాపత్రాల ముద్రణకు ఇంఛార్జ్‌గా ఉన్న హైదరాబాద్ వాసి జీత్ నాయక్ సహా 15 మందిని నిందితులుగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. చదవండి: రణరంగంగా అమృత్సర్.. బారికేడ్లు తోసుకుని తల్వార్లతో పోలీస్ స్టేషన్‌కు! -
పాత వాసనల కొత్త చట్టం?
కాలంతో పాటు మార్పు సహజం. చట్టాలూ మారాల్సిందే. కానీ, టెలికామ్ శాఖ బుధవారం జారీ చేసిన ‘భారతీయ టెలికమ్యూనికేషన్ బిల్లు –2022’లో ప్రతిపాదించిన మార్పుల్లో ఉన్న మంచీచెడూ పెద్ద చర్చే రేపుతున్నాయి. ఆధునిక కాలపు ‘ఓవర్ ది టాప్’ (ఓటీటీ) కమ్యూనికేషన్ సేవలైన వాట్సప్, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్‌లను కూడా ఇకపై టెలికామ్ సేవల పరిధిలోకే తేవాలనేది ఈ కొత్త బిల్లు కీలక ప్రతిపాదనల్లో ఒకటి. అలాగే, ‘టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ట్రాయ్) చట్టానికీ మార్పులను ప్రతిపాదించింది. వాటికి ఆమోదముద్ర పడితే, ఇన్నాళ్ళూ సిఫార్సు సంఘంగా టెలికామ్ రంగానికి కావలి కాస్తున్న ‘ట్రాయ్’ నిర్వీర్యమవుతుంది. కేంద్రానికి ఇలా మరిన్ని అధికారాలు కట్టబెడుతూ, పాత లైసెన్స్ రాజ్యానికి బాట వేస్తున్నారనేది ప్రధాన విమర్శ. స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం అందించే టెలికామ్ పరిశ్రమకు 3 ప్రత్యేక చట్టాలున్నాయి... ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం – 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫీ చట్టం – 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (అన్‌లాఫుల్ ప్రొటెక్షన్) చట్టం – 1950. ఇంటర్నెట్ సహా ఆధునిక సాంకేతికతలెన్నో వచ్చిన వేళ ఈ మూడింటినీ ఏకీకృతం చేసి, వాటి స్థానంలో సమకాలీనమైన కొత్త చట్టం తీసుకురావాలని ప్రయత్నం. అందులో భాగంగా వేలంలో స్పెక్ట్రమ్ కేటాయింపు లాంటి వాటికి చట్టపరమైన అండనివ్వాలని చూశారు. వినియోగదారుల రక్షణపై అధికంగా దృష్టి పెట్టడమూ ప్రస్తుత పరిస్థితుల్లో అభినందనీయమే. అందులో భాగంగానే ఆన్లైన్ ఛాట్, ఓటీటీ సేవలను సైతం మిగిలిన చాలావాటితో కలిపి, టెలికామ్ సేవలనే విస్తృత విభాగంలోకి తేనున్నారు. ఒకప్పుడు బ్రాడ్‌క్యాస్ట్ టీవీని బ్రిటీష్ హయాంలో వైర్ టెలిగ్రఫీ ఒక్కటే ఉన్నప్పటి 1885 నాటి టెలిగ్రాఫ్ చట్టపరిధిలోకి తెచ్చారు. అలాగే, ఇప్పుడీ వర్గీకరణతో యూజర్లు భావ వినిమయానికి టెలికామ్ నెట్‌వర్క్‌లను వాడే ఈ యాప్‌లన్నీ కొత్త లైసెన్స్‌రాజ్ కిందకొస్తాయి. దీనివల్ల అతి నియంత్రణ తప్పదు. ఇప్పటి వరకు ఒక సర్వీస్ ప్రొవైడర్‌కు కొత్త లైసెన్స్ ఇవ్వాలంటే, టెలికామ్ శాఖ కచ్చితంగా ‘ట్రాయ్’ అభిప్రాయం తీసుకోవాలి. అది ‘ట్రాయ్’ చట్టంలోని నిబంధన. కానీ, కొత్త బిల్లుతో ఆ అవసరం ఉండదు. అలాగే, టెలికామ్ శాఖకు తగిన సిఫార్సు చేయడానికి అవసరమైన సమాచా రాన్నీ, పత్రాలనూ ప్రభుత్వాన్ని అడిగి తీసుకొనే అధికారం ఇప్పటి దాకా ‘ట్రాయ్’కి ఉంది. కొత్త బిల్లుతో అదీ కొండెక్కనుంది. ‘ట్రాయ్’ సిఫార్సులను అంగీకరించకున్నా, మార్పు కోరుకున్నా ఆ సిఫార్సులను టెలికామ్ శాఖ పునఃపరిశీలనకు పంపాలనేది ఇప్పుడున్న నిబంధన. కొత్త బిల్లు దానికీ చెల్లుచీటీ ఇవ్వనుంది. ఒక్కముక్కలో ‘ట్రాయ్’ని ఉత్సవ విగ్రహంలా కూర్చోబెడతారన్న మాట! అయితే, పరిశ్రమకు సంబంధించిన కొన్ని అంశాలకు ఈ కొత్త టెలికామ్ బిల్లు స్పష్టతనిచ్చింది. ఏదైనా టెలికామ్ సంస్థ దివాళా తీస్తే, దాని అధీనంలోని స్పెక్ట్రమ్ కేంద్రానికి చెందుతుందా, బ్యాంకులకు చెందుతుందా అనేది ప్రస్తుతం స్పష్టత లేదు. దివాళా తీస్తే, ఆ స్పెక్ట్రమ్ తిరిగి కేంద్రం చేతిలోకి రావాలని కొత్త బిల్లులో టెలికామ్ శాఖ ప్రతిపాదించింది. అసాధారణ పరిస్థితుల్లో లైసెన్స్ దార్ల అప్పుల్ని మాఫీ చేసేందుకూ, ఉపశమనం కల్పించేందుకూ కేంద్రానికి అధికారం కట్టబెట్టింది. మరోపక్క ఇప్పటి దాకా టెలికామ్ ఫండ్ ఆపరేటర్ల సవరించిన స్థూల ఆదాయంపై 5 శాతం యూనివర్సల్ సర్వీస్ లెవీ విధిస్తున్నారు. ఆ ‘యూనివర్సల్ సర్వీస్ నిర్బంధ నిధి’ని ఇకపై ‘టెలికమ్యూనికేషన్ అభివృద్ధి నిధి’ (టీడీఎఫ్)గా మార్చాలని ఆలోచన. టీడీఎఫ్‌తో అంతగా సేవలు లేని పట్టణ ప్రాంతాలను మెరుగుపరచాలనీ, పరిశోధన – అభివృద్ధికి ఖర్చు చేయాలనీ ప్రతిపాదన. నిజానికి, జాతీయ వనరులైన ఎయిర్‌వేవ్స్‌ను అపరిమితంగా పంచుకోవడం కుదరదు గనక భద్రతా కారణాల రీత్యా 1991 అనంతర కాలంలోనూ టెలికామ్ రంగం నియంత్రిత మార్కెట్టే. ఇప్పుడు కొత్తగా పుంజుకున్న ఆన్లైన్ మార్కెట్లను స్వేచ్ఛగా వదిలేద్దామంటే, జూమ్ సహా వివిధ యాప్‌లు పాటిస్తున్న కస్టమర్ల సమాచార సేకరణ దేశానికి చిక్కులు తేవచ్చు. ఈ అనివార్యతలతో కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, చాలాభాగం డిజిటల్ యాప్స్ ఐటీ నిబంధనల్ని పాటిస్తున్నాయి. నిరుడు కొత్త డిజిటల్ ఇండియా బిల్లు రూపొందిస్తూ, కొన్ని మార్గదర్శకాలనూ ఇచ్చారు. ఒకవేళ సమగ్ర చట్టపరిధి అవసరమనుకుంటే పరస్పర సంబంధమున్న ఐటీ, వ్యక్తిగత గోప్యత, టెలికామ్, డిజిటల్ సేవల ప్రతిపాదనలన్నీ సర్కారు ఒకేసారి జనం ముందుకు తేవాలి. అన్నిటినీ కలిపి పరిశీలించి, విశ్లేషించుకొనే వీలుంటుంది. ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్ ఫోనే ఇంటర్నెట్కు సింహద్వారం. టెలికామ్ లింకులే డిజిటల్ ఇండియా స్వప్నానికి రాచమార్గం. అందుకే, నిబంధనలు అస్పష్టంగా ఉంటే వర్తమాన పరిస్థితుల్లాగ గందరగోళం రేగుతుంది. అలాగని అతి కఠిన చట్టం చేస్తే, ఆర్థిక వ్యవస్థలోని సైబర్ విజృంభణ చిక్కుల్లో పడుతుంది. శాంతి భద్రతల పేరిట వివిధ యాప్‌లలోని ఛాట్లను అడ్డగించడానికీ, అవసరాన్ని బట్టి ఇంటర్నెట్ను నిలిపివేయడానికీ తాజా బిల్లు వీలు కల్పిస్తోంది. గోప్యత భద్రత, భావప్రకటన స్వేచ్ఛలపై తాజా రాజ్యాంగ పరిణామాల్ని కూడా విస్మరించి, 2022 నాటి చట్టాన్నీ 1885 చట్టం స్ఫూర్తితోనే రూపొందిస్తే కష్టం. ఏ చట్టమైనా అటు పరిశ్రమకూ, ఇటు యూజర్లకూ స్నేహశీలంగా ఉండాలి. ప్రభుత్వ విధానాలు ప్రజలకు సాధికారత నివ్వాలి. ప్రతిపాదిత టెలికామ్ బిల్లులో మార్పుచేర్పులకు అదే దిక్సూచి కావాలి. -
కొత్త టెలికం బిల్లు 10 నెలల్లో అమల్లోకి..
న్యూఢిల్లీ: దాదాపు 137 ఏళ్ల పాత ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ స్థానంలో కొత్త టెలికం బిల్లు 6–10 నెలల్లో అమల్లోకి రాగలదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే, దీనిపై ప్రభుత్వమేమీ తొందరపడటం లేదని పేర్కొన్నారు. ‘చర్చల ప్రక్రియ బట్టి తుది ముసాయిదా రూపొందుతుంది. ఆ తర్వాత అది వివిధ ప్రక్రియలు పూర్తి చేసుకుని పార్లమెంటు ముందుకు వెడుతుంది. ఇందుకోసం 6–10 నెలల పట్టొచ్చు. మేము ఏమీ తొందరపడటం లేదు‘ అని వైష్ణవ్ చెప్పారు. కొత్త టెలికం బిల్లు గానీ ఆమోదం పొందితే ఇంటర్నెట్ కాలింగ్, మెసేజీ సర్వీసులు అందించే వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలు కూడా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించాలంటే టెలికం లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా యాప్స్ నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. ‘వివిధ ప్లాట్‌ఫాంల ద్వారా కాల్స్ చేయగలిగినప్పుడు అవన్నీ కూడా ఏదో ఒక నియంత్రణ సంస్థ పరిధిలో ఉండాలి. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ఆలోచన ఉంది. టెక్నాలజీ తీసుకొచ్చిన అనేకానేక మార్పుల వల్ల వాయిస్ కాల్, డేటా కాల్ మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది‘ అని వైష్ణవ్ తెలిపారు. యూజర్ల రక్షణని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని బిల్లు రూపొందిందని ఆయన పేర్కొన్నారు. అలాగే యూజర్లు కూడా ఆపరేటర్ల నుంచి సర్వీసులు పొందేందుకు సరైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తప్పుడు వివరాలు ఇస్తే ఏడాది వరకూ జైలు శిక్ష విధించేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
భారతీయులకు గుడ్‌న్యూస్.. డేటా రక్షణకు కొత్త బిల్లు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించి కొత్త బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి తీసుకొస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును లోక్‌సభ నుంచి బుధవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి వైష్ణవ్ దీనిపై మాట్లాడారు. ఈ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీ మంచి నివేదిక ఇచ్చినట్టు అశ్వని వైష్ణవ్ తెలిపారు. ‘‘బిల్లులోని 99 సెక్షన్లకు గాను 81 సవరణలను సూచించింది. అలాగే, కొత్తగా మరో 12 ముఖ్యమైన సిఫారసులు కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త బిల్లు తీసుకురావడం మినహా మారో మార్గం లేదు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు, వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో రాజీ పడకుండా కొత్త చట్టాన్ని తయారు చేశాం. పార్లమెంటు ప్రక్రియ కూడా పూర్తి చేశాం. త్వరలోనే కొత్త చట్టాన్ని అనుమతి కోసం తీసుకొస్తాం. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి కొత్త బిల్లు ఆమోదం పొందొచ్చు’’ అని మంత్రి వివరించారు. ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సమగ్రమైన కార్యాచరణతో వస్తామని ప్రకటించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన డేటా గోప్యత, అత్యాధునిక సాంకేతికతలు, డేటా గవర్నెన్స్ కార్యాచరణ ఇందులో ఉంటాయన్నారు. అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి: నాస్కామ్ వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ముందు, అంతర్జాతీయంగా అమల్లో ఉన్న డేటా గోప్యత చట్టాలను అధ్యయనం చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ సూచించింది. అలాగే, కిందటి బిల్లుపై వచ్చినన అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వం డేటా రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించిన నేపథ్యంలో నాస్కామ్ కీలక సూచనలు చేయడం గమనార్హం. గత బిల్లులో దేశాల మధ్య డేటా బదిలీకి సంబంధించి కఠినమైన నిబంధనల పట్ల దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు గగ్గోలు పెట్టడం తెలిసిందే. డేటా ఆధారిత సేవలు సురక్షితంగా, విశ్వసనీయ మార్గంలో వృద్ధి చెందేలా అవకాశం కల్పించాలని నాస్కామ్ కోరింది. సంప్రదింపుల్లో భాగం కల్పించండి.. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును భారత్ వెనక్కి తీసుకోవడాన్ని అంతర్జాటీయ టెక్నాలజీ దిగ్గజాలు అభినందించాయి. కొత్త బిల్లుకు సంబంధించి చర్చల్లో తమకూ భాగస్వామ్యం కల్పించాలని అమెరికాకు చెందిన ఐటీఐ కోరింది. ఇందులో గూగుల్, మెటా, అమెజాన్ తదితర కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ‘డిజిటల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించి సమగ్రమైన న్యాయ కార్యాచరణను (కొత్త చట్టం) తిరిగి పరిశీలించే విషయంలో బలమైన భాగస్వామ్యుల సంప్రదింపులకు అవకాశం కలి్పంచాలనే ప్రణాళికను ఐటీఐ స్వాగతిస్తోంది’అని ఐటీఐ కంట్రీ మేనేజర్ (భారత్) కుమార్‌దీప్ తెలిపారు. ఇది కూడా చదవండి: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్... -
పాక్‌లో ప్రవాసుల ఓటు హక్కు రద్దు చేసే సవరణ బిల్లు
Pakistan To Ban Overseas Citizens From Voting, Stops Use Of EVMs: ఎలక్ట్రానిక్ యంత్రాల(ఈవీఎం)ల వినియోగాన్ని నిలిపేయడం తోపాటు, ప్రవాసులు ఓటు హక్కు రద్దు చేస్తు పాక్ నేషనల్ అసెంబ్లీ ఒక కొత్త చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడాని కంటే ముందు స్థానిక ఉప ఎన్నికల్లో మరిన్ని పైలెట్ ప్రాజెక్టులు నిర్వహించడమే ఈ బిల్లు మొదటి లక్ష్యంగా పేర్కొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముర్తాజా జావేద్ అబ్బాసీ సమర్పించిన ఎన్నికల చట్ట సవరణ బిల్లు 2022ను దిగువ సభలో మెజారిటీ ఓట్లతో ఆమోదిం పొందింది. ఐతే ఈ బిల్లును కేవలం గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఈ మేరకు ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్ఎన్) మంత్రి అజం నజీర్ తరార్ ఈ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ....ఎన్నికల చట్టం 2017 సవరణలకు ముందు ఉన్న విధంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఈ బిల్లు చేస్తుందని చెప్పారు. ఈ బిల్లు చట్టంలోని సెక్షన్ 94, 107కి సంబంధించిన సవరణలని తెలిపారు. అంతేకాదు గత పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం ఎన్నికల చట్టం 2017కి పలు సవరణలు చేసిందని గుర్తు చేశారు. అలాగే పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) కూడా తక్కువ సమయంలో ఈవీఎంల ద్వారా ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేకుండా ఎన్నికలు నిర్వహించలేమంటూ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేశారు. ఐతే పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్) ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వ తిరోగమన చర్యగా పేర్కొంది. పీటీఐతొమ్మిది మిలియన్లకు పైగా పాకిస్తానీ విదేశీయులకు ఓటు హక్కును కల్పిస్తే ఈ దుండగుల ప్రభుత్వం వాటిని హరించే లక్ష్యంతో సవరణలు చేసిందంటూ ఆరోపణలు గుప్పించింది. -
ఆ బిల్లు తెస్తే.. పెట్టుబడులకు ప్రమాదమే
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినట్లుగా ప్రతిపాదిత డేటా భద్రత బిల్లును అమల్లోకి తెస్తే భారత్‌లో వ్యాపారాల నిర్వహణ పరిస్థితులు గణనీయంగా దెబ్బతింటాయని పలు అంతర్జాతీయ పరిశ్రమల సమాఖ్యలు కేంద్రానికి లేఖ రాశాయి. దీని వల్ల విదేశీ పెట్టుబడులు రావడం కూడా తగ్గుతుందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు సంబంధిత వర్గాలతో విస్తృతంగా సమాలోచనలు జరపాలని కోరాయి. భారత్‌తో పాటు అమెరికా, జపాన్, యూరప్, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన దాదాపు డజను పైగా పరిశ్రమల అసోసియేషన్లు మార్చి 1న కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మేరకు లేఖ రాశాయి. గూగుల్, అమెజాన్, సిస్కో, డెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న ఐటీఐ, జేఈఐటీఏ, టెక్‌యూకే, అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్, బిజినెస్ యూరప్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. వ్యక్తిగత డేటా భద్రత బిల్లులోని నిబంధనల వల్ల దేశీయంగా కొత్త ఆవిష్కరణల వ్యవస్థకు, తత్ఫలితంగా లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్య సాకారానికి విఘాతం కలుగుతుందని లేఖలో పేర్కొన్నాయి. వ్యక్తిగతయేతర డేటాను కూడా బిల్లు పరిధిలో చేర్చడం, సీమాంతర డేటా బదిలీతో పాటు డేటాను స్థానికంగానే నిల్వ చేయాలంటూ ఆంక్షలు ప్రతిపాదించడంపై పరిశ్రమ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిబంధనలను అమలు చేస్తే భారత్‌లో వ్యాపారాలను సులభతరంగా నిర్వహించే వీల్లేకుండా పరిస్థితులు దిగజారుతాయని, స్టార్టప్ వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
సర్కారీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచే ఆంగ్లంలో విద్యా బోధన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింత చేరువ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై సమగ్ర అధ్యయనం జరపడంతో పాటు విధివిధానాల రూపకల్పన కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కె.తారక రామారావుతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. వచ్చే శాసనసభా సమావేశాల్లో ఈ మేరకు నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. మరోవైపు నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘మన ఊరు–మన బడి’ ప్రణాళిక అమలుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదుపులోనే కరోనా: హరీశ్‌రావు రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు వివరించారు. రాష్ట్రంలో 5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని, అర్హులైన అందరికీ త్వరగా టీకాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. సంపూర్ణంగా ధాన్యం కొనుగోళ్లు వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే చాలాచోట్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావచ్చినా, అకాల వర్షాలతో కొన్ని జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. అందువల్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఇలావుండగా ఇటీవల అకాల వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పర్యటించాలని తీర్మానించింది. బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యార్థులకు రిజర్వేషన్లు సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల.. పరిశోధన సంస్థలో (ఎఫ్సీఆర్ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్లను ప్రభుత్వం అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ చదివిన విద్యార్థులకు అటవీశాఖ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (ఏసీఎఫ్) పోస్టుల్లో 25 శాతం, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ), ఫారెస్టర్స్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ రూల్స్–1997, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–2000కు సవరణలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను అందించగా, వచ్చే కేబినెట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికతో రావాలని ఆదేశించింది. కాగా రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తదుపరి మంత్రివర్గ సమావేశం ముందు పూర్తిస్థాయి ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ రద్దు మంత్రివర్గ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహిస్తారని సీఎం కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం ఆహ్వానం రావడంతో మీడియా ప్రతినిధులు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. నేషనల్ మీడియాకు సీఎంఓ నుంచి సోమవారం ఉదయమే కబురు అందింది. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రధానంగా మాట్లాడతారనే చర్చ జరిగింది. ఢిల్లీ నుంచి కూడా కొందరు విలేకరులు వచ్చారు. అయితే చివరిలో ఈ విలేకరుల సమావేశం రద్దైనట్టు సీఎంఓ ప్రకటించింది. కేబినెట్లో చర్చించాల్సిన ఎజెండా అంశాలు ఎక్కువగా ఉన్నందున, సమావేశం ఎక్కువసేపు కొనసాగే అవకాశమున్న పరిస్థితుల్లో, మీడియాకు అసౌకర్యం కలగరాదనే ఉద్దేశంతో అనివార్య పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ రద్దు చేసినట్టు వివరణ ఇచ్చింది. ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలి విద్యారంగంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో.. పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్ గుర్తించింది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన చేపట్టినట్టయితే తమ పిల్లలను స్థానిక పాఠశాలల్లోనే చేర్పించేందుకు వారు సంసిద్ధంగా ఉన్నారని భావించింది. ఈ నేపథ్యంలోనే సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అందుకు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిషు మీడియంలో బోధించేందుకు టీచర్లకు తర్ఫీదునిచ్చేందుకు, నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడం ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. సర్కారీ స్కూళ్లకు కొత్త సొబగులు రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు వీలుగా ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడం కోసం డిజిటల్ క్లాస్ రూంలు, అదనపు తరగతి గదులు, అవసరమైన మేరకు ఫర్నిచర్ ఏర్పాటు, మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశం. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం.. గతంలో రెండుసార్లు సమావేశమైన సబిత నేతృత్వంలోని మంత్రుల బృందం ‘మన ఊరు – మన బడి’ విధివిధానాలను రూపొందించింది. 12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించడం జరిగింది. అవి.. నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, త్రాగు నీటి సరఫరా, విద్యార్థులు మరియు సిబ్బందికి సరిపడ ఫర్నిచర్, పాఠశాల మొత్తానికి కొత్తగా రంగులు వేయడం, పెద్ద ..చిన్న మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ గోడలు, వంట గదులు (షెడ్లు), శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు, ఉన్నత పాఠశాలల్లో భోజనశాలలు, డిజిటల్ విద్య అమలు. ఇందుకు రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం ‘పాఠశాల నిర్వహణ కమిటీ’ (ఎస్.ఎమ్.సి.)లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ప్రతి స్కూల్లో పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. -
లఘు, చిన్న పరిశ్రమలకు చేయూత
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లుకు పార్లమెంటు గురువారం ఆమోదముద్ర వేసింది. జూలై 26న బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించగా, తాజాగా రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి వర్కింగ్ క్యాపిటల్ లభ్యత కొంత సులభతరం అవుతుంది. ప్రభుత్వం రంగ సంస్థలుసహా తమకు బకాయిలు చెల్లించాల్సిన కంపెనీల నుంచి ఎంఎస్ఎంఈలు త్వరిత గతిన వసూళ్లును చేయగలుగుతాయి. తమకు రావాల్సిన మొత్తాలను మూడవ పార్టీకి విక్రయించి తక్షణ నిధులు పొందడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చిన్న పరిశ్రమలు వర్కింగ్ క్యాపిటల్ విషయంలో ఎటువంటి ఇబ్బందీ ఎదుర్కొనకుండా తాజా బిల్లు ఆమోదం దోహదపడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిల్లు ఆమోదం చర్చ సందర్భంగా పేర్కొన్నారు. యూకే సిన్హా కమిటీ చేసిన పలు సిఫారసులను ఈ బిల్లులో చేర్చారు. 2020 సెప్టెంబర్‌లో బిల్లును తీసుకువచ్చారు. అనంతరం హౌస్ స్థాయి సంఘానికి రిఫర్ చేశారు. -
ఇక అక్కడ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’!
కాన్బెరా: తమ మాధ్యమాలలో కనిపించే వార్తలకు, వార్తాకథనాలకు సంబంధించి ఆయా ఆస్ట్రేలియన్ వార్తాసంస్థలకు ఫేస్బుక్, గూగుల్ డబ్బులు చెల్లించేలా ఆస్ట్రేలియా కొత్త చట్టం తీసుకువస్తోంది. సంబంధిత బిల్లుపై వచ్చేవారం ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చ జరగనుంది. డిసెంబర్ నెలలోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి సెనెట్ ఎకనమిక్స్ లెజిస్టేషన్ కమిటీ ఈ బిల్లును క్షుణ్నంగా అధ్యయనం చేసి, ముసాయిదా బిల్లులో ఎలాంటి మార్పులు అవసరం లేదని శుక్రవారం నివేదిక ఇచ్చింది. ఈ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’ ఆచరణ సాధ్యం కాదన్న గూగుల్, ఫేస్‌బుక్‌ల వాదనను కమిటీ తోసిపుచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఫేస్బుక్, గూగుల్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై కనిపించే వార్తలకు సంబంధిత ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్ సేవలను నిలిపేస్తామని గూగుల్ ఇప్పటికే హెచ్చరించింది. తమ యూజర్లు ఆస్ట్రేలియాకు సంబంధించిన వార్తలను షేర్ చేసుకోకుండా నిషేధిస్తామని ఫేస్బుక్ కూడా పేర్కొంది. -
వ్యవసాయం కార్పొరేటీకరణ ?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆర్డినెన్స్ రూపంలో ఉన్న వీటిని రైతన్నలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. ఆ మూడు బిల్లులు 1. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు 2. రైతుల (సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు 3. నిత్యావసర సరుకుల (సవరణ) బిల్లు ప్రభుత్వం చెబుతున్నదేంటి ? మొదటి బిల్లు రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) ప్రకారం రైతులు పండించిన పంటల్ని మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనలు ఉండవు. తమ ఉత్పత్తుల్ని ఎప్పుడైనా, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మార్కెట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కువ ధర వచ్చినప్పుడే తమ పంటను అమ్ముకోవచ్చు. ఇక రెండో బిల్లు రైతుల ధరల హామీ, సేవల ఒప్పందం ప్రకారం పంటలు వేయడానికి ముందే వ్యాపారస్తులతో రైతులు చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత వస్తుంది. కాంట్రాక్ట్ సేద్యాన్ని చట్టబద్ధం చేయడం వల్ల వ్యాపారులు ఒప్పందాలను ఉల్లంఘించడం కుదరదు. ఇక మూడో బిల్లు నిత్యావసరాల సవరణ బిల్లు ప్రకారం చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి ఆహార ఉత్పత్తుల నిల్వలపై ఆంక్షలు తొలగిపోతాయి. కాగా నిత్యావసరాల సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. రైతుల డిమాండ్లు ఇవీ ► మూడు బిల్లుల్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి ► మండీ వ్యవస్థని కొనసాగించాలి ► రుణ మాఫీ చేయాలి ► స్వామినాథన్ సిఫార్స్‌ల మేరకు పంటలకి కనీస మద్దతు ధర -
యూకే పార్లమెంట్‌కు కొత్త వీసా విధానం
లండన్: బ్రెగ్జిట్ అనంతర వీసా విధానానికి సంబంధించిన బిల్లును సోమవారం బ్రిటన్ పార్లమెంటులో మరోసారి ప్రవేశపెట్టారు.ఏ దేశం వారనే ప్రాతిపదికన కాకుండా, నైపుణ్యాల ఆధారంగా, పాయింట్స్ కేటాయించి, తదనుగుణంగా వీసాలను జారీ చేయాలనే ప్రతిపాదనతో ఆ చరిత్రాత్మక బిల్లును రూపొందించారు. ఈ కొత్త విధానం వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. బ్రిటన్‌లో ఉద్యోగం పొందేందుకు, అక్కడ ఉండేందుకు అనుమతి లభించాలంటే ఈ పాయింట్స్ విధానం ప్రకారం.. కనీసం 70 పాయింట్లు రావాలి. వృత్తిగత నైపుణ్యం, ఇంగ్లీష్ మాట్లాడగలిగే నైపుణ్యం, మంచి వేతనంతో స్థానిక సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ లెటర్.. మొదలైన వాటికి పాయింట్స్ ఉంటాయి. -
మోదీ కొత్త సర్కార్ కొత్త బిల్లు ఇదేనా?
సాక్షి, ముంబై : బీజేపీ రథ సారథి నరేంద్రమోదీ నేతృత్వంలో రెండవసారి కొలువు దీరనున్న బీజేపీ సర్కారు ఒక కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దేశంలో కాలుష్యరహిత ఇంధనాల వాడకాన్ని పెంచే కృషిలో భాగంగా ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని భారీగా ప్రోత్సహించనుంది. దీనికి సంబంధించిన ఒక దీర్ఘకాలిక పాలసీని రూపొందించనుంది. అలాగే దేశీయంగా బ్యాటరీ ఉత్పత్తులకు ఊతమివ్వనుంది. దీనికి మద్దతుగా బ్యాటరీ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను భారీగా పెంచనుంది. ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న కాలంతీరిన వాహనాల నిషేధానికి రంగం సిద్ధం చేస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశ ప్రజలను ఈవీల వాడకం ప్రోత్సహించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించనుంది. దేశీయ ఆటోమొబైల్ రంగానికి ఊతమివ్వడంతోపాటు, దేశంలో పెరుగుతున్న కాలుష్య కాసారాన్ని రూపుమాపాలని భావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నితీ ఆయోగ్ ఇటీవల రూపొందించిన ముసాయిదా ప్రతిపాదన, ఈ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించనుందని సమాచారం. రానున్న కాలంలో దేశంలోని, ద్విచక్ర వాహనాలను మూడు చక్రాల ఆటో రిక్షాలను పూర్తిగా ఎలక్ట్రిక్‌వాహనాలుగా మార్చాలని సిఫారసు చేసిందట. ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సొసైటీ ఆఫ్ డేటా ప్రకారం, గత ఏడాది 54,800 ఈ-వాహనాలతో పోలిస్తే 12 నెలల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లో లక్ష 26వేలు అంటే రెట్టింపునకు పైగా విక్రయాలు నమోదయ్యాయి. మార్చి 31 వ తేదీకి భారతదేశం 21 మిలియన్ల మోటర్‌బైక్‌లను, స్కూటర్లను విక్రయాలతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ద్విచక్ర మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. అదే సమయంలో కేవలం 3.3 మిలియన్ల కార్లు యుటిలిటీ వాహనాలను విక్రయించింది. కాగా దేశంలో ఊహించని మెజార్టీతో బీజేపీ సాధించిన విజయాన్ని చిన్న, మధ్య తరహా ఇండస్ట్రీతో పాటు, దిగ్గజ పారిశ్రామిక వర్గాలు స్వాగతించిన సంగతి తెలిసిందే. -
జెండర్‌ను మార్చుకునే కొత్త చట్టం
టాస్మానియా దేశం లింగ వివక్షను రూపుమాపడానికి కొత్త చట్టం తెస్తోంది. ఇకపై ఆ దేశంలో పదహారు సంవత్సరాలు దాటిన ట్రాన్స్జెండర్లు ఎవ్వరి అనుమతి లేకుండా తమ జెండర్‌ను మార్చుకోవచ్చు. అలాగే జనన ధృవీకరణ పత్రాలపై, వివాహం చేసుకునేటప్పుడు, చివరికి డెత్ సర్టిఫికెట్లో కూడా తమ జెండర్‌ను చట్టబద్దంగా నమోదు చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ముర్కిసన్ స్వతంత్ర ఎమ్మెల్సీ రూత్ ఫారెస్ట్ ప్రవేశ పెట్టిన బిల్లును ఎగువ సభ ఆమోదించగా, వచ్చేవారం నుంచి అధికారికంగా అమలు కాబోతోంది. ఒకవేళ పదహారు సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండి జెండర్‌ను మార్చాలనుకుంటే అందుకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి అవసరం. ఇందుకు వారు కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వాములుగా మారిన ఇద్దరు ట్రాన్స్జెండర్ల మధ్య విడాకులు తీసుకోవడానికి ముందు తమ తమ బర్త్ సర్టిఫికేట్లపై లింగ మార్పిడికి వీలుండదు. అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా లింగ వివక్ష, హోమోసెక్సువల్ గురించిన అసభ్యకర భాషను కూడా నిషేధించారు. ‘ఈ చట్టం వల్ల మా దేశంలో ఎలాంటి లింగ వివక్ష లేకుండా అందరూ సమానమే’నన్న భావన పెరుగుతుందని ఈ బిల్లు పెట్టిన రూత్ ఫారెస్ట్ అన్నారు. -
హెచ్4లకు ఉద్యోగాల రద్దు వద్దు!
వాషింగ్టన్: హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములు దేశంలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పించే నిబంధనను రద్దు చేయొద్దంటూ అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు సభ్యులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములైన హెచ్ 4 వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో కల్పించారు. అప్పటినుంచి లక్షకు పైగా హెచ్ 4 వీసాదారులు, వారిలో అధికులు మహిళలే.. అమెరికాలో ఉద్యోగాలు సాధించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికన్ల ఉద్యోగ భద్రత కారణంగా చూపుతూ ఈ అవకాశాన్ని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఏడాది చివరలోగా ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చ వచ్చన్న వార్తల నేపథ్యంలో.. అమెరికా కాంగ్రెస్‌లో అనా జీ ఏషూ, జో లాఫ్రెన్ ‘హెచ్ 4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగావకాశాలను నిరాకరించడం వల్ల అమెరికా ఆర్థికవ్యవస్థకు నష్టం కలుగుతుందని, భారత్, చైనా తదితర దేశాలకు చెందిన నిపుణులైన విదేశీ ఉద్యోగులు దేశం విడిచి వెళ్లడం కానీ, లేదా మెరుగైన వీసా నిబంధనలున్న మరో దేశానికి వెళ్లడం కానీ జరిగే అవకాశముం దని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక, సైద్ధాంతిక నిపుణులైన విదేశీయులకు అమెరికా లో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేదే హెచ్1 బీ వీసా. భారత్ నుంచి వేలాది మంది ఈ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హెచ్ 4 వీసాపై అమెరికా వెళ్లిన వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగాలు చేయడం వల్ల ఆ కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థకూ ఉపయోగపడిందని లాఫ్రెన్ పేర్కొన్నారు. హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగావకాశం కల్పించడం ఆర్థిక సమానత్వానికి, కుటుంబ విలువలకు సంబంధించిన అంశమన్నారు. -
భారతీయులకు శుభవార్త.. గ్రీన్‌కార్డుపై కొత్త బిల్లు
వాషింగ్టన్: అమెరికాలోభారతీయులు ఊరట కల్పించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని, గ్రీన్ కార్డ్ వార్షిక కేటాయింపులను 45 శాతానికి పెంచాలని కోరుతూ ఒక ప్రతిపాదనను అమెరికా ప్రతినిధులు సభలో ప్రవేశపెట్టారు. తాజా బిల్లు ప్రకారం ప్రస్తుతం కేటాయిస్తున్న గ్రీన్ కార్డుల సంఖ్య సంవత్సరానికి లక్ష 20వేలనుంచి ఒక లక్ష, 75వేలకు పెరగనుంది. ఈ ప్రతిపాదనతో గ్రీన్ కార్డుకోసం వేచిచూస్తున్న 5లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరతుందని అంచనా. ఈ బిల్లు ప్రకకారం గ్రీన్ కార్డుల కేటాయింపు సంవత్సరానికి 1,20,000 నుండి 1,75,000 లకు పెంచాలని సభ్యులు ప్రతిపాదించారు. హెచ్1బి వీసాతో అమెరికాలో అడుగుపెడుతున్న భారత ఐటీ ఇంజనీర్లు ఆ తర్వాత గ్రీన్ కార్డు (శాశ్వత నివాస)హోదా పొందుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌కార్డు కొనసాగింపుపై చేసిన ప్రకటన అందోళన రేకెత్తించింది. అయితే ఈ కొత్త బిల్లు చట్టంగా మారితే భారత ఐటీ ఇంజనీర్లకు ప్రయోజనం చేకూరుతుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. కాగా అమెరికాలో నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డులను సొంతం చేసుకునే వారిలో సింహ భాగం భారతీయులేనన్న విషయం తెలిసిందే. ట్రంప్ సర్కారు మద్దతుతో ప్రతినిధుల సభ ముందుకు చేరిన ఈ బిల్లు ఆమోదం పొంది, అద్యక్షుడి సంతకం కూడా పూర్తయి చట్టంగా మారితే, ప్రస్తుతమున్న వైవిధ్య వీసా కార్యక్రమానికి చెక్ పడతుందని భావిస్తున్నారు. -
‘ట్రిపుల్ తలాక్’ బిల్లులో చిల్లులెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ట్రిపుల్ తలాక్’ పేరిట ముస్లిం యువతులకు ఏకపక్షంగా విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ది ముస్లిం విమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్)–బిల్’ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ‘ట్రిపుల్ తలాక్’ చెల్లదంటూ గత ఆగస్టు నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కచ్ఛితంగా అమలయ్యేలా చూడాలంటే ప్రభుత్వం జోక్యం అవసరమని భావించడం వల్ల ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. పెళ్లయిన ముస్లిం మహిళలను రక్షించడం కోసం తీసుకొచ్చిన ఈ బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ముస్లిం యువకులను వేధించే అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. బిల్లులోని మూడవ సెక్షన్ ప్రకారం పెళ్లయిన ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు నోటిమాటగాగానీ, రాతపూర్వకంగాగానీ, ఎలక్ట్రానిక్ రూపంలోగానీ, మరే ఇతర రూపాల్లోగానీ ‘ట్రిపుల్ తలాక్’ చెప్పడం చెల్లదు, అది చట్టవిరుద్ధం. చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్ సుప్రీం కోర్టు తీర్పుకు అనుకూలంగానే ఉంది. (సాక్షి ప్రత్యేకం) ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని బిల్లులోని ఏడవ సెక్షన్ ‘కాగ్నిజబుల్ అఫెన్స్ (పరిగణించతగ్గ తీవ్రమైన నేరం)’గా పరిగణిస్తోంది. అంటే ఎలాంటి వారెంట్ లేకుండా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయవచ్చు. బాధిత భార్య భర్తను శిక్షించాలని కోరుకోక పోయినా ఈ సెక్షన్ కింద భర్తను విచారించి జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ భార్య తప్పుడు ఫిర్యాదు చేసినా భర్తకు శిక్ష తప్పదు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్‌గా ఈ నేరాన్ని పరిగణించి నట్లయితే ముందుగా బాధితురాలు మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయాలి. ఆ కేసును విచారించాల్సిన అవసరం ఉందా, లేదా? పోలీసుల దర్యాప్తునకు ఆదేశించి నిందితుడికి శిక్ష విధించాల్సిన అవసరం ఉందా? అన్న అంశాలను మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. (సాక్షి ప్రత్యేకం) హిందువులకు సంబంధించిన చట్టాలతో ఈ కొత్త చట్టాన్ని పోల్చిచూస్తే మత వివక్ష కూడా స్పష్టంగా కనిపిస్తోందని న్యాయనిపుణులు చెబుతున్నారు. తన నుంచి విడిపోయిన భార్యను రేప్ చేసిన ఓ హిందూ భర్తను చట్టప్రకారం శిక్షించాలంటే భార్య అనుమతి తప్పనిసరి. ఇక్కడ త్రిపుల్ తలాక్ చెప్పిన ముస్లిం భర్తను శిక్షించడానికి భార్య అనుమతే అవసరం లేదు. హిందువుల్లో వరకట్నాన్ని నిషేధిస్తూ 1961లో తీసుకొచ్చిన చట్టంలో కూడా నిందితులకు రక్షణ ఉంది. (సాక్షి ప్రత్యేకం) భార్య లేదా సమీప బంధువులు ఫిర్యాదు చేస్తేగానీ కేసు నమోదు చేయకూడదు. విచారణ జరపరాదు. మన దేశంలో ముస్లిం మహిళల వివాహాలను ‘అఖిల భారత ముస్లిం లా బోర్డు’ పర్యవేక్షిస్తోందన్న విషయం మనకు తెల్సిందే. ముస్లిం వివాహాలకు సంబంధించి ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా వాటికి సంబంధించిన బిల్లులపై ముందుగా ఆ బోర్డు అభిప్రాయాలను తీసుకోవడం మన గత ప్రభుత్వాల ఆనవాయితీ. ఈసారి అలాంటి అభిప్రాయలను తీసుకోకుండానే బిల్లును తీసుకొచ్చారు. ‘ట్రిపుల్ తలాక్’ నుంచి ముస్లిం మహిళలను రక్షించడం కోసం తీసుకొచ్చిన ఈ బిల్లు వల్ల ముస్లిం కమ్యూనిటీకే ముస్లిం మహిళలు దూరమై, మరింత సామాజిక శిక్షకు గురయ్యే ప్రమాదం ఉందని ‘శ్యారా బానో కేసు’లో ఆమెకు అండగా నిలబడి వాదించిన మహిళా సంఘం ‘బెబ్యాక్ కలెక్టివ్’ ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం స్త్రీ, పురుషుల మధ్య వివక్షను తొలిగించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని శంకించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘ట్రిపుల్ తలాక్’ చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంలో ఈ మహిళా సంఘం కృషి ఎంతో ఉందన్న విషయం తెల్సిందే. (సాక్షి ప్రత్యేకం) -
ఆసుపత్రులకు ఆపరేషన్
-
ఆసుపత్రులకు ఆపరేషన్
- ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల ఆగడాలకు చెక్ - ఒకే గ్రేడ్ ఉన్న ఆసుపత్రుల్లో ఒకే ఫీజులు - ఫీజులను ఆసుపత్రుల ముందు తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రదర్శించాలి - చేసిన చికిత్సలన్నీ ఆన్లైన్లో వెల్లడించాలి - వాటిపై నెలనెలా ఆడిట్ చేయనున్న ప్రభుత్వం - వైద్యం వికటిస్తే ఆసుపత్రిపైనా చర్యలు - స్టెంట్ల ధరలపైనా నియంత్రణ - తప్పు చేసినట్టు తేలితే రూ.5 లక్షల వరకు జరిమానా.. రిజిస్ట్రేషన్ రద్దు.. రేపు లేదా ఎల్లుండి అసెంబ్లీలో బిల్లు! సాక్షి, హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యానికి చెక్ పడుతోంది! ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇక సర్కారు నియంత్రణలోకి రాబోతున్నాయి. వాటిలో జరిగే ప్రతీ చికిత్స ఇక నుంచి ప్రభుత్వానికి తెలియాల్సిందే. రోజువారీ జరిగే అన్ని రకాల చికిత్సలను ఆన్లైన్లో బహిరంగపర్చాల్సిందే! అలా ఆన్లైన్లో వెల్లడించిన వివరాలపై ప్రభుత్వం నెలనెలా ఆడిట్ చేసి ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల బాగోతాన్ని సమీక్షించి లోపాలుంటే కొరడా ఝళిపించనుంది. వైద్యం వికటిస్తే ప్రస్తుతం కేవలం డాక్టర్‌పైనే చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై సంబంధిత ఆసుపత్రి కూడా బాధ్యత వహించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేంద్ర స్థాయిలోని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్) యాక్టును తెలంగాణకు వర్తింప చేస్తూ మరో చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లును సోమ లేదా మంగళవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. బిల్లును ఆమోదించాక అది చట్ట రూపంలోకి రానుంది. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలు కానుంది. అడిగేవారు లేక ఇష్టారాజ్యం... రాష్ట్రంలో 80 శాతం ఔట్‌పేషెంట్ (ఓపీ), 70 శాతం ఇన్‌పేషెంట్ (ఐపీ) సేవలు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారానే జరుగుతున్నాయని అంచనా. ప్రభుత్వ వైద్యరంగం విఫలమవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. అలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదు. కేవలం ఆసుపత్రికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తప్పించి సర్కారుకు సంబంధం లేకుండా పోయింది. దీంతో అనవసర ఆపరేషన్లు కోకొల్లలుగా జరుగుతున్నాయి. గుండెకు సంబంధించిన సమస్య వస్తే అవసరం లేకున్నా.. స్టెంట్లు వేయడం, బైపాస్ సర్జరీలు చేయడం పరిపాటిగా మారింది. అవసరం లేకున్నా వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద మోకాలు మార్పిడి చికిత్సలకైతే అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఫీజులు, చికిత్స బిల్లులు.. సరేసరి. దేనికీ ఓ కొలమానం అంటూ లేకుండా పోయింది. దేశంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే సిజేరేయన్ ఆపరేషన్లలో తెలంగాణ 75 శాతంతో మొదటి స్థానంలో ఉంది. కరీంనగర్ జిల్లాలో అయితే ఇది ఏకంగా 81.1 శాతం ఉండటం విస్మయం కలిగిస్తోంది. ఇలా అనవసరపు ఆపరేషన్లతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్టెంట్ల ధరలను తగ్గించినా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు గతంలో మాదిరిగానే వసూలు చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు ధర తక్కువగా చూపుతూ చేసిన చికిత్సకు, గదులకు అధిక బిల్లులు వేసి జేబులు గుల్ల చేస్తున్నాయి. మరోవైపు డయాగ్నస్టిక్ సెంటర్లు గల్లీకొకటి పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో దాదాపు సగానికిపైగా కేంద్రాల్లో ప్రమాణాలు ఉండడం లేదు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త చట్టంతో వీటన్నింటికీ ముకుతాడు పడనుంది. తప్పు చేస్తే రూ.5 లక్షల వరకు జరిమానా.. రిజిస్ట్రేషన్ రద్దు కొత్త చట్టం రూపొందించాక రాష్ట్రస్థాయిలో ఒక కౌన్సిల్‌ని నియమిస్తారు. దాని ద్వారా మొత్తం చికిత్సలను ఆన్లైన్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్), ఆరోగ్యశ్రీ మాదిరిగా ఏకీకృత ఫీజులను నిర్ధారిస్తారు. ఆసుపత్రులను గ్రేడులుగా విభజిస్తారు. గ్రేడుల వారీగా ఫీజులను నిర్ధారిస్తారు. ఒకే రకపు గ్రేడ్ ఉన్న ఆసుపత్రులన్నింటిలోనూ ఒకే ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుంది. చికిత్స, వాటికయ్యే ఖర్చుల జాబితాను ఆసుపత్రి ముందు అందరికీ కనిపించేలా తెలుగు, ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలి. ప్రతి రోగి వివరాలను.. అతడికి అందించిన శస్త్రచికిత్స వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలి. ఏదైనా చికిత్స చేయాల్సి వస్తే దానికి కారణం చెప్పాలి. అనవసర చికిత్సలు చేసినట్లు ఆడిట్లో బయటపడితే ఆసుపత్రికి రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తీవ్రమైన తప్పు చేస్తే ఆ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ పూర్తిగా రద్దు చేస్తారు.