లండన్: బ్రెగ్జిట్ అనంతర వీసా విధానానికి సంబంధించిన బిల్లును సోమవారం బ్రిటన్ పార్లమెంటులో మరోసారి ప్రవేశపెట్టారు.ఏ దేశం వారనే ప్రాతిపదికన కాకుండా, నైపుణ్యాల ఆధారంగా, పాయింట్స్ కేటాయించి, తదనుగుణంగా వీసాలను జారీ చేయాలనే ప్రతిపాదనతో ఆ చరిత్రాత్మక బిల్లును రూపొందించారు. ఈ కొత్త విధానం వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. బ్రిటన్‌లో ఉద్యోగం పొందేందుకు, అక్కడ ఉండేందుకు అనుమతి లభించాలంటే ఈ పాయింట్స్ విధానం ప్రకారం.. కనీసం 70 పాయింట్లు రావాలి. వృత్తిగత నైపుణ్యం, ఇంగ్లీష్ మాట్లాడగలిగే నైపుణ్యం, మంచి వేతనంతో స్థానిక సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ లెటర్.. మొదలైన వాటికి పాయింట్స్ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment