Women bill
-
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రహ్లాద్ జోషి
ఢిల్లీ: అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ సెషన్ లో 21 బిల్లులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం నేడు ముగిసింది. ఈ సమావేశానికి 23 పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. పేదల కోసం అనేక అద్భుత పథకాలు తెచ్చాం.. అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. పూర్తి స్థాయిలో జరగాల్సిన చివరి సెషన్.. స్వల్ప కాలిక చర్చకు వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విపక్షాలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు(శనివారం) నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. #WATCH | Delhi: An all-party meeting is underway at the Parliament Library building, ahead of the winter session of Parliament. The winter session of Parliament, 2023 will begin from December 4 and continue till December 22. pic.twitter.com/PSwDtGFyPk — ANI (@ANI) December 2, 2023 శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఐపిసి , సీఆర్పీసీలను మారుస్తూ కొత్త బిల్లులను తీసుకురానున్నారు. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి చివరి శీతాకాల సమావేశాలు గమనార్హం. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: Rajasthan Exit Poll Analysis: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు? -
ఇంకో ఆరేళ్లు ఆగిబయటకు రా..!
ఇంకో ఆరేళ్లు ఆగి బయటకు రా..! -
మహిళాబిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం శుభపరిణామం
సాక్షి, హైదరాబాద్: మహిళాబిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమని, రాజకీయాలకతీతంగా ఈ బిల్లుకు మద్దతిద్దామని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని..మహిళలు సమాన హక్కు పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నాయని మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిప్రాయపడ్డారు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు స్థానాలు రిజర్వేషన్?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మహిళా బిల్లు ప్రస్తావన ప్రకంపనలు రేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మన రాష్ట్రంలో ఎమ్మెల్యే ఆశావహులను జమిలీ ప్రకటన వెంటాడుతుండగానే మహిళా బిల్లు వార్త గుండెలపై పిడుగుపాటులా పడింది. మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం లాంఛనమైన వేళ ఈ చర్చ స్థానికంగా దుమారం రేపుతోంది. బిల్లు ఇప్పటికిప్పుడు అమల్లోకి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఏయే స్థానాలు రిజర్వేషన్ కిందకు వస్తాయి? అన్న లెక్కలు అప్పుడే మొదలయ్యాయి. అయితే, అదే సమయంలో మహిళా బిల్లును చూడకుండా అందులో పొందుపర్చిన అంశాలు అధ్యయనం చేయకుండా అప్పుడే నిర్ణయానికి రాలేమని సీనియర్ ఎమ్మెల్యేలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ నోట్ల రద్దు తరహాలో ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అమలు చేస్తే మాత్రం ఉమ్మడి జిల్లా రాజకీయాలపై పా ర్టీలకు అతీతంగా ప్రభావం చూపడం గ్యారెంటీ అ ని కుండబద్దలు కొడుతున్నారు. ఇది నియోజవకరా ్గల పునర్విభజన తర్వాత ఉంటుందా? లేదా ఇ ప్పుడే అమలు చేస్తారా? అనే దానిపై స్పష్టత లేదు. పాత జిల్లా పరిస్థితి ఇదీ ఉద్యమాల జిల్లాగా పేరొందిన పాత కరీంనగర్ జిల్లా ప్రజలు ఓటు రూపంలో తీర్పులు ఇవ్వడంలోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మొత్తం మూడు పార్లమెంటు, 13 అసెంబ్లీ స్థానాలు ఉన్న పాత జిల్లాలో మహిళా రిజర్వేషన్ ఇప్పటికప్పుడు అమలు చేయాల్సి వస్తే.. కనీసం నాలుగు సీట్లు కేటాయించాల్సి వస్తుంది. ఇప్పటికే మానకొండూరు, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు. వీటికి అదనంగా మరో నాలుగు సీట్లను జనాభా దామాషాన మహిళలకు కేటాయించాల్సి వస్తుంది. అంటే.. మూడు ఎస్సీ, నాలుగు మహిళలకు కేటాయిస్తే ఆరు జనరల్ స్థానాలు అవుతాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 13 మంది అసెంబ్లీ స్థానాలకు 13 మంది అభ్యర్థులు పురుషులనే ప్రకటించింది. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదు. బీఎస్పీ, ఏఐఎఫ్బీ నుంచి పోటీకి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. మహిళా బిల్లు అనివార్యమైతే ఇప్పటికే బరిలో ఉన్న సిట్టింగ్‌లు, పోటీ చేయబోయే ఆశావహుల(దాదాపు 150 మంది)కు ఈ బిల్లును శరాఘాతంగా భావిస్తున్నారు. 1951 నుంచి తక్కువే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కరీంనగర్ జిల్లా నుంచి మహిళా ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పాలి. దీనికి సామాజికంగా, రాజకీయంగా అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్రంలో 1951లో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి జేఎం రాజమణి దేవి (ఎస్సీఎఫ్) వేదికపై విజయం సాధించారు. తర్వాత 1972 నుస్తులాపూర్ నియోజకవర్గం నుంచి ప్రేమలతా దేవి (కాంగ్రెస్) విజయం సాధించారు. 1998లో విద్యాసాగర్‌రావు లోక్‌సభకు ఎన్నికవడంతో మెట్పల్లి అసెంబ్లీస్థానానికి రాజీనామా చేశారు. దీంతో కొమిరెడ్డి జ్యోతిదేవి (కాంగ్రెస్) మెట్పల్లి ఉపఎన్నికల్లో గెలిచారు. 1998, 1999 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా డాక్టర్ సుగుణకుమారి రెండుసార్లు గెలిచారు. 2014లో చొప్పదండి నుంచి బొడిగె శోభ (టీఆర్ఎస్) ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం 33శాతం అమలు చేయాల్సి వస్తే ఈ లెక్కలన్నీ మారిపోతాయనడంలో సందేహం లేదు. తెరపైకి సతీమణులు మహిళా బిల్లు ఇప్పటికప్పుడు అమలు చేయాల్సి వచ్చినా.. మన నేతలు నిరుత్సాహపడినా.. పోటీకి వెనకడుగు వేయడం, నియోజకవర్గం మారడం వంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ఒకవేళ మహిళా బిల్లు అమలు చేయాల్సి వస్తే తమ భార్యలు, కూతుళ్లు, కోడళ్లను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. మహిళా బిల్లు పార్టీలతో సంబంధం లేకుండా అమలు చేయాల్సిన అంశం కాబట్టి, దీని అమలు ప్రభావం అన్ని పార్టీల్లో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థుల పేర్లు మార్చాల్సి రావొచ్చు. అలాగే, కాంగ్రెస్, బీజేపీలు కూడా బిల్లుకు అనుగుణంగా తమ జాబితాను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ నాయకుడైనా సరే తమకు కాకుంటే తమ ఇంట్లో ఆడవారికి ఇప్పించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. తిరిగి గెలిచేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఈసారైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీలు గత పదేళ్లుగా నియోజకవర్గాల్లో రూ.కోట్లాది ఖర్చు చేశారు. తీరా మహిళా బిల్లు వారికి శరాఘాతంగా మారినా.. అమలు అనివార్యమైతే దానిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో తలమునకలయ్యారు. -
సాక్షి కార్టూన్ 07-09-2023
-
మహిళా బిల్లు ఆమోదానికి ఒక్క నిమిషం చాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేంద్రంలో మెజారిటీ ఉన్న బీజేపీకి మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని.. అయితే ఆ దిశగా ఆలోచించడం లేదని కవిత వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐపీసీ, సీర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును మాత్రం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం జాతీయస్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‘అనే పుస్తక ఆవిష్కరణ సభలో కవిత పాల్గొని మాట్లాడారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని కవిత ఆకాంక్షించారు. ఆ సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. కార్పొరేట్ రంగంలో కూడా మహిళా వివక్ష కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న 80% స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్దతివ్వడం లేదన్నారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలకు ఎక్కడికి వెళ్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశంలో 29% మహిళలే ఉద్యోగాల్లో ఉన్నారని ఇలాగైతే దేశం వృద్ధి చెందలేదన్నారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ప్రశ్నించారు. కాగా భారత్‌లో కంపల్సరీ ఓటింగ్ రావాలని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు. -
...అంతా కిల్‘బిల్’పాండేలే!
కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్న సామెత ఉంది. మనం చెప్పిన దానికి కాసింత కాళిదాసు లాంటి పెద్దవాళ్ల పేరు జోడించి వారి అకౌంట్లో వేయడం జరుగుతుంటుంది. తద్వారా చెప్పిన దానికి మరింత ప్రాచుర్యం వస్తుందని.. అలాంటిదే ఒకటి చూద్దాం.. అనగనగా ఆ కాలంలో ఓ ఆకతాయి యువకుడు ఉండేవాడు. ఆ ఆకతాయి వీధిలో వెళ్తున్న ఓ అమ్మాయిని చూసి రావే.. రావే అని కామెంట్ చేశాడు.. ఆ అమ్మాయికి ఒళ్లుమండి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. ఇప్పటిలా ఎంపీ లకైనా సమన్లు జారీ చేసి ‘ముద్దు ముచ్చట్ల’కు జవాబు చెప్పండి అని ఆదేశించే మహిళా కమిషన్లు అప్పట్లో లేవు. ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి మీడియా కూడా లేదు. పైగా ధైర్యం ఉన్న ఇప్పటి ‘నవ్య’ తరం కూడా కాదు. ఆడియో, వీడియోలు షేర్ చెయ్యడానికి సోషల్ మీడియా కూడా లేదు. అప్పట్లో న్యాయాధికారి, ఆపై మహారాజు గారే యాక్షన్ తీసుకోవాలి. న్యాయాధికారి విషయాన్ని సీరియస్‌గానే తీసుకుని విచారణకు రమ్మని ఆకతాయిని ఆదేశించాడు. ఇది తెలిసిన ఆకతాయి తండ్రి కంగారు పడిపోయాడు. ఇంట్లోనే ఆకతాయికి దేహశుద్ధి చేశాడు. కానీ, రాజదండన నుంచి ఎలా తప్పించడమో పాలు పోలేదు. ఆయనకు తెలిసిన కవి ఒకరు రాజు గారి ఆస్థానంలో ఉన్నారు. కవి గారి దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. కవి సాంతం విని, కొడుకును దార్లో పెట్టుకుంటానని తండ్రి వద్ద గట్టిగా మాట తీసుకుని ఓ ఐడియా చెప్పాడు. ‘‘నేను ఓ శ్లోకం చెబుతా, న్యాయవిచారణ సమయంలో మీ కొడుకును చెప్పమను..’’ అంటూ, దానితో పాటు ముందుగా బాధితురాలైన అమ్మాయి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పండి అని సలహా ఇచ్చాడు. తండ్రి ఆయన చెప్పినట్టుగా చేసి ఆకతాయితో శ్లోకం బట్టీ పట్టించాడు. న్యాయవిచారణ జరుగుతున్నపుడు.. ‘నేను రావే రావే అని ఊరికే అనలేదు, నేను అప్పుడు చదివిన శ్లోకంలో భాగమే అది..’ అని కవి చెప్పిన శ్లోకం చదివాడు. గేహే గేహే జంగమా హేమవల్లీ వల్లా్యం వల్లా్యం పారణశ్చంద్రబింబః బింబే బింబే కోకిలా మంజురావః రావే రావే జాయతే పంచబాణః (ప్రతి ఇంట్లోనూ ఒక కదిలే బంగారు తీగ ఉంది. ప్రతి తీగలోనూ ఒక పూర్ణ చంద్రబింబం ఉంది. ప్రతీ చంద్ర బింబంలోనూ ఒక కోకిల స్వరం ఉంది. ఆ ప్రతీ ధ్వనిలోనూ మన్మథుడు ఉన్నాడు.) ఈ శ్లోకం చదువుతుండగా ఆమెకు రావే రావే అని మాత్రమే వినిపించిందని వివరణ ఇచ్చాడు. అంతకు ముందే ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పిన కారణంగా ఆ అమ్మాయి కూడా మరింత రెట్టించ లేదు. ఇప్పటి ‘నవ్య ’తరంలాగా.. ‘‘మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తా, కిరోసిన్ పోసి నిప్పంటిస్తా...’’ అని ఘాటుగా హె చ్చరించలేదు గానీ బుద్ధిగా ఉండమని సూచించింది. కథ కంచికి వెళ్లింది. అందరూ ఇంటికి వెళ్లారు. ఈ శ్లోకం రాసిచ్చిన కవి ‘కాళిదాసే’ అని ప్రచారం. ఇది కాళిదాసు కవిత్వమా, ఎవరిదైనా పైత్యమా అన్న విషయం వదిలేస్తే.. ఆ కాలం నుంచీ అమ్మాయిలంటే చులకనగా చూసే ఆకతాయిలున్నారు, విచారణలున్నాయి, క్షమాపణలున్నాయి. ఇప్పటికీ పరిస్థితేం పెద్దగా మారలేదు. మెడికోలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా.. ఎవరయినా అంతే. పైన చెప్పుకున్న దానికి.. కింద మనం మాట్లాడుకోబోయే విషయానికి క్లోజ్ రిలేషన్ ఉందా.. బాదరాయణ సంబంధమేనా..? మీరే తేల్చుకోండి. ఈ నెలలోనే మహిళా దినోత్సవం వచ్చింది. మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావనా వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం ఢిల్లీలో దీక్ష...దీని వెనుక వేరే కారణాలున్నాయని విమర్శలున్నాయనుకోండి. కాసింత చర్చయితే అయ్యింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆశలు సాకారమైతే, వారి సాధికారతవైపు సమాజం అడుగులు వేస్తే... మహిళలపై వివక్ష తగ్గితే.. గౌరవం పెరిగితే పైన చెప్పుకున్న సంఘటనలు లాంటివి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న ఆశలు కనిపించాయి. కానీ, ప్రతి మహిళా దినోత్సవం రోజు అన్ని పార్టీలు, సంఘాలు, ప్రముఖులు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావించడం. కుదిరితే కాసిన్ని దీక్షలు.. ఆ తర్వాత మరిచి పోవడం.. అంతే, ఒకటి కాదు రెండు కాదు 26 ఏళ్లుగా ఇదే తంతు. ..ఎందుకంటే పైన మనం చెప్పుకున్న కామెంట్లూ, కథలూ కంచికిపోలే.. మన మధ్యే ఉన్నాయి. ఇవి ఆకతాయిల మాటలు కాదు.. మీరే చూడండి. – ఓ రోజు మహిళా బిల్లుపై సీరియస్ చర్చ జరుగుతోంది. సమర్థించే వారు గొంతు చించుకుంటున్నారు. ఇంతలో పార్లమెంట్ బయట తిరుగుతున్న ఎంపీని ‘మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటి..’ అని మీడియా అడిగితే ఆయన సమాధానం... ‘మా ఆవిడ చేస్తున్న షాపింగ్ బిల్లు మీద తప్ప నాకే బిల్లుపై ఆసక్తి, ధ్యాసా లేవు..’ అని ఆ తర్వాత ఓ రోజు..‘మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌కు ఏం తెస్తుంది..? బ్యూటీపార్లర్లకు వెళ్లే బాబ్డ్ హెయిర్ మహిళలనా...’ మహిళా బిల్లుపై లాలూప్రసాద్ రియాక్షన్. చట్టసభల్లో కూర్చుని మన రాత రాసే నేతల ధోరణి ఇలా ఉంటే.. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ టీవీ చానల్ కామన్ పీపుల్‌తో పిచ్చాపాటిగా మాట్లాడింది.. వినండి. – పార్లమెంట్లో అంత చర్చ జరుగుతోందిగా, ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే.. వారిలో కొందరి సమాధానాలు ఇవీ. – ‘అవునవును నేను కూడా విన్నాను. మా ఆవిడ కూడా అడిగింది. మరీ రచ్చ బాగా చేస్తున్నారు.. బిల్లు ఎక్కువ అయ్యిందా అని..’ (జోక్ ?) – ‘నాకు బిల్ క్లింటన్ మాత్రమే తెలుసు ఈ బిల్ గురించి ఐడియా లేదు..’ (లైట్?) – ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడొస్తుంది..? ‘వారికి అధికారం వచ్చేసిందిగా.. క్రెడిట్ కార్డ్‌ల రాకతో’ (వెటకారం?) – ఉమెన్ రిజర్వేషన్ వస్తుందా..? ‘లాలూ రైల్వే కోచ్‌లలో మహిళలకు కొన్ని కేటాయించా డుగా..’(సరదా?) – చట్టసభల్లో మహిళల కోటా గురించి చెప్పండి. ‘ఇప్పుడు ఇంట్లో అంతా వారి పెత్తనం.. ఇక రెండు సభల్లో వారిదే పెత్తనం అవుతుంది. దేశాన్ని వారే నడుపుతారు..’ (తేలిక భావం?) బిల్లు తేవాల్సిన చట్టసభల్లో నాయకులకూ, బయట సాధారణ ప్రజలకూ ఒకే రకమైన భావజాలం ఉన్నాక, 26 ఏళ్లే కాదు ఎన్నేళ్లయినా అలాగే ఉంటుంది. మహిళా దినోత్సవం రోజో, ఎన్నికల మేనిఫెస్టోల్లోనో, ఖాళీ దొరికినప్పుడు మాట్లాడుకోవడానికో ఓ సబ్జెక్ట్ అవుతుంది. ‘రాజ్యసభ నుంచి లోక్ సభకు నడిచి వెళ్లడానికి ఐదు నిమిషాలు పడుతుంది. కానీ, రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ఇన్నేళ్లయినా (రాజ్యసభ ఆమోదించిన 2010 నుంచి) లోక్ సభకు చేరనే లేదు..’ – ఇది బృందా కారత్ ఆవేదన. పైన చెప్పుకున్నట్టుగా మన పరిస్థితి ఇలాగే ఉంటే, ఎన్నాళ్లయినా బిల్లు లోక్‌సభ వైపు నడుస్తూనే ఉంటుంది. మనమే కాదు.. అంతటా అంతే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజా నివేదిక చూడండి ప్రపంచవ్యాప్తంగా మంత్రి పదవుల్లో ఉన్న మహిళలు 22.8 శాతమే. కేవలం 13 దేశాల్లోని కేబినెట్లలో మాత్రమే 50%, ఆపైన మహిళా మంత్రులు ఉన్నారు. మహిళలు మంత్రులుగా ఉన్నా వారికి కేటాయిస్తున్న శాఖల ప్రాధాన్యత తక్కువే. ప్రజలు నేరుగా ఎన్నుకునే దిగువ సభల్లో (లోక్‌సభ తరహాలో) మహిళా పార్లమెంటేరియన్లు 26.5 శాతమే. అయితే ఇది 1995లో 11%గానే ఉండగా ప్రస్తుతం కొంత మెరుగుపడింది. దిగువ సభలో 50%, అంతకన్నా ఎక్కువ మంది ఎంపీలున్న దేశాలు ఆరు మాత్రమే. రువాండాలో 61%, క్యూబాలో 53%, నికరాగ్వాలో 52%, మెక్సికో, న్యూజిలాండ్, యూఏఈలలో 50% మహిళా ఎంపీలున్నారు. ఈ ఆరింటితోపాటు మరో 17 దేశాల్లో 40% పైన మహిళా ఎంపీలు ఉన్నారు. 22 దేశాల్లో మహిళా ఎంపీలు 10% కన్నా తక్కువే -సరికొండ చలపతి -
మహిళా బిల్లుకు మద్దతిస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెడితే తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించే ఈ బిల్లుకు బేషరతుగా మద్దతిస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సోమవారం లేఖ రాశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీలు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేలా మహిళలు తమ హక్కును పొందేందుకు ఈ సమావేశాల్లోనే ఆ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని ప్రధానిని కోరారు. ‘మహిళల జీవితాలపై మీకున్న చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వచ్చే పార్లమెంటు సమావేశాలకన్నా గొప్ప అవకాశం, సరైన సమయం ఏముంటుంది?’ అని అందులో రాహుల్ పేర్కొన్నారు. 2010లోనే రాజ్యసభలో ఆమోదం పొందినా.. లోక్‌సభలో గత ఎనిమిదేళ్లుగా నిలిచిపోయిందని రాహుల్ గుర్తుచేశారు. బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో కృషి చేసినా, బీజేపీ కలసిరాలేదని విమర్శించారు. మహిళల సాధికారతకు ఇప్పటికైనా రాజకీయాలకతీతంగా కలిసి పనిచేద్దామని ప్రధానిని కోరారు. లోక్‌సభలో బలముందిగా..! ‘ఈ బిల్లు ఆమోదంపై మీ పార్టీలో కొందరికి విశ్వాసం లేదు. అలాంటి వారికి .. పంచాయతీ, మునిసిపాలిటీల స్థాయిలోనూ పురుషుల కంటే మహిళలే సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరును మీరు వివరించడాన్ని హర్షిస్తున్నా’ అని రాహల్ పేర్కొన్నారు. లోక్‌సభలో బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలకు బలమైన మెజారిటీ ఉందని గుర్తు చేస్తూ.. ఈ చరిత్రాత్మక బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ఇంతకన్నా ఏం కావాలన్నారు. -
మహిళా బిల్లులో బీసీలకు కోటా ఇవ్వాలి
హైదరాబాద్: పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రాతిపదికన సబ్ కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ మహిళా సంఘాల సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళా బిల్లుకు సార్థకత లేదన్నారు. మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే పలు పార్టీల నాయకులు బీసీ మహిళల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీసీ మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఆర్. శ్వేత, నిఖిత, డాక్టర్ ర్యాగ అరుణ్, గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆమే నిర్ణేత
పార్టీల మేనిఫెస్టోలను నిర్దేశిస్తున్న స్త్రీలు ఎల్.సుమన్‌రెడ్డి: ఆకాశంలో సగమైన అతివ ఇప్పుడు అన్ని అవకాశాలనూ రెండు చేతులా అందిపుచ్చుకుంటోంది. ప్రతి రంగంలోనూ ముందంజ వేస్తోంది పురుషులకు దీటుగానే గాక వారికంటే మిన్నగా కూడా రాణిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా నేతల సారథ్యంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్న పలు దేశాలే అందుకు రుజువు. కానీ వున నేతాశ్రీలు మాత్రం మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తూ వచ్చారే తప్ప విధాన నిర్ణయు ప్రక్రియులో వారికి సముచిత ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కల్పించేందుకు ఏనాడూ చిత్తశుద్ధి కనబరచలేదు. దశాబ్దాల తరబడి చట్టసభల ఆమోదం కోసం ఎదురుతెన్నులు చూస్తున్న మహిళా బిల్లే ఇందుకు సాక్ష్యం. అరుుతే పరిస్థితి వూరుతోంది. మహిళా శక్తిని ఏ పార్టీ కూడా విస్మరించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒకరకంగా పార్టీలన్నీ వుహిళా జపమే చేస్తున్నారుుప్పుడు. ఎన్నికల మేనిఫెస్టోలను కూడా వుహిళలు, వారి అంశాలే నిర్దేశించే పరిస్థితి కన్పిస్తోంది. ఎందుకంటే ఎన్నికల వేళ ఊకదంపుడు విశ్లేషణలతో ఊదరగొట్టి తీరా పోలింగ్ తేదీ నాడు వుుఖం చాటేసే పురుష పుంగవులకు వుహిళల తీరు పూర్తిగా భిన్నం. దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఏ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించినా వుహిళల ఓట్లే 60 శాతం, ఆ పైచిలుకు ఉంటున్నారుు. దాంతో పార్టీలన్నీ ఏదో రకంగా వుహిళా జపం చేస్తున్నారుు. ఆకట్టుకునేలా ప్రచారాస్త్రాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలు మహిళా ట్రెండుకు నాంది పలికే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నారుు. ఢిల్లీనే గాక దేశవుంతటినీ కుదిపేసిన నిర్భయు అత్యాచార ఘటన అనంతరం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోలైన ఓట్లలో పురుషుల కంటే వుహిళల ఓట్లే ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. తమకు సముచిత ప్రాధాన్యం, ఆత్మగౌరవంతో పాటు భద్రత కూడా కల్పించాలన్న డిమాండ్లు నేటి మహిళ నోట విన్పిస్తున్నారుు. పార్టీల వైఖరి కూడా అందుకు అనుగుణంగానే మారుతోంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అవి సరికొత్త ప్రచారాస్త్రాలతో ముందుకు వస్తున్నా యి. వారికోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలను రూపొం దించే పనిలో పడ్డాయి. మహిళా సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతి వేదికపైనా ప్రకటిస్తున్నారు. బీజేపీ కూడా అత్యాచారాలకు కఠిన శిక్షలు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెంపు వంటి దశ సూత్ర ప్రణాళిక ప్రకటించింది. సావూజిక నినాదంతో దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ వావుపక్ష వుహిళావాదుల భాగస్వావ్యుంతో ఆరు సూత్రాల ‘విమెనిఫెస్టో’ను సిద్ధం చేసింది. అయితే దేశవ్యాప్తంగా మహిళల ఓటింగ్ శాతం పెరుగుతున్నంతగా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం మాత్రం పెరగకపోవడం బాధాకరం. జనాభాలో దాదాపు సగవుున్న మహిళలకు ప్రస్తుత లోక్‌సభలో లభించిన ప్రాతినిధ్యం 10.7 శాతం మాత్రమే కావడం గమనార్హం. -
పార్టీలకు ‘ఉమేనిఫెస్టో’
విడుదల చేసిన పౌర, ఉద్యమ సంఘాల ప్రతినిధులు ఆరు సూత్రాలతో కార్యాచరణ పత్రం న్యూఢిల్లీ: మహిళలను శక్తిమంతులుగా చేసే పథకాలతో రాజకీయపార్టీలు తమ మేనిఫెస్టోలు రూపొందించాలని పౌర, ఉద్యమ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు సాధికారత, స్వేచ్ఛ, భద్రత తదితర అంశాలతో కూడిన ఆరు పాయింట్ల ‘ఉమేనిఫెస్టో’ను విడుదల చేశారు. వాటిపై పార్టీలు స్పందించాలని కోరారు. ఆ డిమాండ్లలో ముఖ్యాంశాలు.. - మహిళలపై దాడులు, లింగవివక్ష అంతమొందించేందుకు సుధీర్ఘమైన, సమగ్రమైన, సరిపడినన్ని నిధులతో కూడిన విద్యావిధానాన్ని ప్రభుత్వరంగంలో రూపొందిస్తామని చెప్పాలి. - మహిళలపై దాడులు నియంత్రించడానికి ప్రతి ప్రభుత్వ సంస్థ చట్టాలను అమలు పరచడానికి పక్కా కార్యాచరణ రూపొందించాలి. వాటికి పార్టీలు సహకరించాలి. - మహిళా బిల్లు కార్యరూపం దాల్చడానికి అన్ని పార్టీలు మద్దతివ్వాలి. అలాగే అన్ని కౌన్సిళ్లలో, కమిటీల్లో, టాస్క్‌ఫోర్సుల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇవ్వాలి. - తీవ్రమైన నేరాల్లో బాధితులకు సమగ్రమైన సేవలనందించాలి. పోలీసుల ఆధ్వర్యంలో 24 గంటలు పనిచేసే సహాయక, రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సత్వరం ఆర్థిక సహాయం అందించే చర్యలు చేపట్టాలి. వీటిని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చేస్తామని చెప్పాలి. - మగువలను కించపరిచేలా మాట్లాడేవారిని, లింగవివక్ష చూపేవారిని, లోక్‌సభలో ప్రవర్తన తదితర అంశాల ఆధారంగా ఎన్నికల్లో పోటీచేయకుండా నిరోధించే కోడ్ తీసుకురావడానికి పార్టీలు మద్దతివ్వాలి. - పట్టణాల్లోగానీ, గ్రామాల్లోగానీ అత్యాచారం లాంటి తీవ్రఘటనల్లో వెంటనే స్పందించే సహాయక బృందాలు ఏర్పాటు చేస్తామని పార్టీలన్నీ మాటివ్వాలి.