సాక్షి, హైదరాబాద్: మహిళాబిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమని, రాజకీయాలకతీతంగా ఈ బిల్లుకు మద్దతిద్దామని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే చారిత్రక ఘట్టానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామని..మహిళలు సమాన హక్కు పొందే రోజు కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నాయని మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment