హైదరాబాద్: పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రాతిపదికన సబ్ కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ మహిళా సంఘాల సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళా బిల్లుకు సార్థకత లేదన్నారు.
మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే పలు పార్టీల నాయకులు బీసీ మహిళల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీసీ మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఆర్. శ్వేత, నిఖిత, డాక్టర్ ర్యాగ అరుణ్, గుజ్జ కృష్ణ, నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment