సాక్షి, విజయవాడ: లోక్‌సభ, అసెంబ్లీల గడువు ముగుస్తున్నా, అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజన తీరును మాత్రం ఇప్పటికీ రాజకీయ పార్టీలు పార్లమెంట్‌లో ప్రశ్నించలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రానున్న ప్రభుత్వాలైనా చర్చించాలని కోరుతూ.. ఈ నెల 29న విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నిపార్టీల అధ్యక్షులకు లేఖలు పంపినట్టు ఉండవల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment