
ఢిల్లీ: నేడు కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల నేతలు భేటీ కానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరపనుంది. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరనుంది.
రేపు పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఎల్లుండి ఇంటెరిమ్ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చదవండి: సిమిపై మరో ఐదేళ్ల నిషేధం