
బడ్జెట్‌లో రైతులకు వరాలు ప్రకటిస్తాం.
సాక్షి, న్యూఢిల్లీ: రైతులతో చర్చలకు మేం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నాం. చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సాగు చట్టాల విషయంలో కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాం. ఏడాదిన్నరపాటు సాగు చట్టాల అమలు నిలిపివేతకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులకు కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఇప్పటికీ వర్తిస్తుంది. రైతులతో చర్చిండానికి వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సిద్ధంగా ఉన్నారు. అన్నదాతలతో మరోసారి చర్చలకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారి అభ్యంతరాలను పరిశీలిస్తాం. రానున్న బడ్జెట్‌లో రైతులకు వరాలు ప్రకటిస్తాం’’ అని మోదీ తెలిపారు.
(చదవండి: ‘స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ అయ్యాయి’)