సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను సరిహద్దుగా కలిగి ఉన్న ఢిల్లీలో విస్తరిస్తున్న కరోనా కట్టడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్‌లో నిర్వహిస్తారు. ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీలను ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, సీఎస్, ఢిల్లీ ఆరోగ్య కార్యదర్శులకు లేఖలు రాశారు. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్, కరోనా నియంత్రణ నిబంధనలుపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవటం గమనార్హం. (పాజిటివ్ న్యూస్: 50 దాటిన రికవరీ శాతం)
ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు ఢిల్లీతో ఉన్న సరిహద్దు మార్గాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి ప్రజల రాకపోకల వల్ల తమ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి. ఇక నోయిడా, ఘజియాబాద్ నగరాలతో పోల్చితే ఢిల్లీలో ఎక్కువ కరోనా కేసులు నమోదవటంతో ప్రయాణ పరిమితులను కొనసాగిస్తామని ఉత్తరప్రదేశ్ పేర్కొన్న విషయం తెలిసిందే. (మంత్రి నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో విమర్శలు)
Comments
Please login to add a commentAdd a comment