
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కరోనా నుంచి కోలుకున్న రెండు వారాల తర్వాత అమిత్ షా రెండోసారి ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 2వ తేదీన ఆయన కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. దీంతో గురుగ్రామ్‌లోని మెదంతా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం తీవ్ర అలసట, ఒళ్లు నొప్పుల కారణంగా వైద్యుల సలహా మేరకు ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేరారు. 13 రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఆగస్టు 31న ఇంటికి వెళ్లారు. అయితే మరోసారి ఆయన ఆరోగ్యం తిరగబెట్టటంతో శనివారం రాత్రి 11గంటల సమయంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చదవండి : జయప్రకాశ్ మరణం తీరని లోటు: మోదీ
Comments
Please login to add a commentAdd a comment