సాక్షి, అమరావతి: జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్‌లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్.. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఇక తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలోని అన్ని చట్ట సభలకు (పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 2022లో 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది జరిగే మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశానికి ఆప్, టీడీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment