ఈ అఖిల పక్షం ఎవరి కోసం? | Article On Undavalli Arun Kumar All Party Meeting | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 1 2019 1:05 AM | Last Updated on Fri, Feb 1 2019 1:05 AM

Article On Undavalli Arun Kumar All Party Meeting - Sakshi

ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఓ రాజకీయ మేధావిగా పేరు ప్రఖ్యాతులు కల వారు. ఆయనకు ప్రత్యేక గౌరవం డాక్టర్‌ వైఎస్‌ రాజ శేఖరరెడ్డికి అత్యంత సన్నిహి తంగా కొనసాగిన నేపథ్యం. ప్రత్యేకించి ఒక దినపత్రికతో, రాష్ట్రంలోనే రాజకీయ పరిణామాలను నిర్దేశించే స్థాయిని అనుభవించిన సంస్థతో ఢీకొని, మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యవహారా  లలో అవినీతి అక్రమాలు జరిగాయని పోరాడిన నేపథ్యం ఆయనది. 

ఈ రోజు ఆయన అఖిలపక్ష సమావేశం అంటూ ఒక రాజకీయ ప్రహసనానికి తెరలేపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధుల విడుదల తదితర అంశాలపై కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, ప్రజారాజ్యం, సీపీఐ, సీపీఎం తది తర పార్టీలతో ఒక కార్యాచరణ లక్ష్యంగా ఆ సమా వేశం ఏర్పాటు చేసినట్లు ఆయన ప్రకటించారు. వైఎ స్సార్‌సీపీ, సీపీఎం ఈ సమావేశంలో పాల్గొనబో మని స్పష్టంగా ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని భావించే ఉండవల్లి ఆ రకంగా అక్రమంగా రాష్ట్రాన్ని విభజిం చిన బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలతో కలసి ఏం పోరాటం చేస్తారు..? పైగా తిరుపతిలో వెంకన్న పాదాల సాక్షిగా నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రక టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ, బాబు కేంద్రంలో నాలుగు సంవత్సరాలు పైబడి అధికారంలో కొనసాగి ప్రత్యేక హోదా అంశం మరుగున పరిచి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. అలాగే పవన్‌ సైతం ప్రత్యేకహోదా కోసం ఒక కార్యాచరణను చిత్తశుద్ధితో చేపట్టిన దాఖలాలు లేవు. 

పైగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి వైఎ స్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలుపరచడంపై సమరశీల పోరాటాలు చేశారు. అనేక సభలు, దీక్షలు చేపట్టారు. ఒకానొక దశలో ఉండవల్లి, జయప్రకాష్‌ నారాయణ్, పవన్‌కల్యాణ్‌ ఒక బృందంగా ఏర్పడి రాష్ట్రానికి జరి గిన అన్యాయంపై పోరాటం అంటూ రాజకీయం మొదలుపెట్టారు. పవన్‌కల్యాణ్‌ ఒకఅడుగు ముందు కువేసి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యే కించి మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే తాను 50 మంది ఎంపీలను తమిళనాడు, తది తర రాష్ట్రాల నుండి అవిశ్వాసానికి వ్యతిరేకంగా సమీ కరించగలనని, మద్దతు కూడగట్టగలనని సవాల్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ ఆ సవాలును స్వీకరిస్తూ పవన్‌ కల్యాణ్‌ తన రాజకీయ మిత్రుడు అయిన చంద్ర బాబుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతు ఇవ్వగలమని లేదా మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే పవన్, బాబు ఎంపీలతో మాకు మద్దతు ప్రకటించగలరా అంటూ ప్రతి సవాల్‌ విసిరారు. కానీ పవన్‌ ఈ సవాల్‌కు స్పందించలేదు. 

పైగా ప్రత్యేక హోదా విషయంలో లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదుగురు వైఎస్సా ర్‌సీపీ ఎంపీలకే చెల్లింది. రాజ్యసభలో విజయ సాయిరెడ్డి సైతం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చివరకు ఢిల్లీ ఏపీ భవన్‌లో లోక్‌సభకు రాజీనామా చేసి నిరవధిక నిరాహార దీక్షకు మేకపాటి రాజ మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌రావు, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు పూనుకున్నారు. ఈ పరిణామాన్ని ఉండవల్లి కానీ, పవన్‌ కానీ ఆహ్వా నించి వారికి మద్దతుగా దీక్ష స్థలానికి వెళ్లలేదు. ఇదే సమయంలో ప్రత్యేకహోదా సాధన సమితి వారు చలసాని శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎంపీలకు తమ మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. 

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై పవన్‌ ఏ రకంగా స్పందించారు? అవినీతి అక్రమాలపై ఆయన కార్యాచరణ ఎలా జరిగింది. రాజధాని ప్రాంతంలో రైతుల భూములు బలవంతాన లాక్కున్న బాబు ప్రభుత్వ నిరంకుశ విధానంపై పవన్‌ జరిపిన రాజకీయ పోరాటం ఏమిటి? ఇటీవల బాబు పవన్‌ను తనతో కలసి రాజకీయ ప్రయాణం చేయాలని బహిరంగంగానే ఆహ్వానించారు. ఇవన్నీ తెలిసి కూడూ టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌లతో కలసి ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం ఉండవల్లి ఏ పోరాటం చేస్తారు? 

ఇప్పుడు జరిగే రాజకీయ సమీకరణ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. పవన్, బాబు, కాంగ్రెస్‌ తదితరులతో కలిసి విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం అంటూ త్వరలోనే ఉండవల్లి సారథ్యంలో ఒక ఆందోళన జరిగితే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రచార ఆర్భాటాలు, కల్ల బొల్లి ప్రకటనలు ఉండవల్లి విశ్వస నీయతను పెంచ లేవు. నిర్దిష్ట కార్యాచరణ ఆయన రూపొందించు కోవాలి. ఎవరు రాష్ట్ర ప్రయో జనాల కోసం పోరాడ గలుగుతున్నారు అనే అంశం ఉండవల్లి అర్థం చేసుకోవాలి. అటువంటి శక్తులతో కలసి ఆయన కార్యాచరణ రూపొందించుకోవాలి.


ఇమామ్‌ 
వ్యాసకర్త కదలిక సంపాదకులు
మొబైల్‌ : 99899 04389

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement