హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ మద్దతిచ్చే అంశంపై తమ పార్టీ పునరాలోచన చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కారిక్మకుల పట్ల కేసీఆర్ వైఖరిని వారు తప్పుబట్టారు.