సాక్షి, అమరావతి : పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. మన కుటుంబాల కోసం పాటుపడుతున్న సైనికుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు.
అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment