సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. వీర సైనికులకు సంఘీభావం ప్రకటించారు. ముష్కరులు సాగించిన మారణకాండలో అమరులైన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. (ఉగ్ర మారణహోమం)
I strongly condemn this cowardly attack on @crpfindia convoy in #Pulwama and stand in solidarity with our brave soldiers. My heart goes out to the grieving families of the martyrs and I pray for the speedy recovery of the injured jawans. #CRPF
— YS Jagan Mohan Reddy (@ysjagan) 15 February 2019
Comments
Please login to add a commentAdd a comment