రంజాన్ సందర్భంగా ముంబై వీధిలోని తినుబండారాల సముదాయం
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం కావటంతో దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉపవాసం, ప్రార్థనలు, ఇఫ్తార్‌ల కోలాహలం కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం అరుదైన దృశ్యం దర్శనమిస్తోంది. సెహ్రీ (ఉపవాసానికి ముందుగా అంటే సూర్యోదయానికి ముందుగా తీసుకునే భోజనం) కోసం ఓ సిక్కు వృద్ధుడు సాయం చేస్తున్నారు. సాధారణంగా సెహ్రీ కోసం లౌడ్ స్పీకర్లు లేదా ఇలా డప్పులతో చాటింపు వేయించటం మాములే. అలా చేసేవారిని షహర్‌ఖ్వాన్ అంటారు. ఈ పనిని ఇస్లాం మతానికి చెందిన వ్యక్తే చేస్తుంటారు. మైనార్టీ తెగలకు చెందిన వారు ఈ పని చేయటం అరుదనే చెప్పొచ్చు. ఓ సిక్కు వ్యక్తి ఈ పని చేస్తుండటం, పైగా కశ్మీర్‌లో.. అది కూడా సమస్యాత్మక ప్రాంతం అయిన పుల్వామాలో కావటంతో ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పలువురు ఆ వృద్ధుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఉపవాసానికి ముందు తెల్లవారుఝామున ఏదైనా తినడం లేదా త్రాగడాన్ని సెహ్రీ అంటారు.. రోజా(ఉపవాసం) ముగించిన తరువాత అంటే సూర్యాస్తమయం తరువాత తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment