Sikh man
-
వీల్‌ఛైర్‌లో ఎదురుచూపులు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం
ఛండీగఢ్: అనాథలా రోడ్ల వెంట తిరుగుతూ ఆ చిన్నారి.. ఆ భార్యభర్తల కంటపడ్డాడు. పిల్లలు లేని ఆ జంట.. భగవంతుడు ఇచ్చిన వరంగా భావించి పెంచుకున్నారు. కడుపున పుట్టకున్నా.. సొంత బిడ్డగా ప్రేమను పంచింది ఆ తల్లి. విధివశాత్తూ 75 ఏళ్ల తర్వాత తనకంటూ రక్తసంబంధీకులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని.. కలుసుకుని కన్నీరుమున్నీరు అయ్యాడు ఆ వ్యక్తి. 1947.. దేశ విభజన సమయంలో అమర్జిత్ సింగ్(అప్పటి పేరు తెలియదు) కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. ఆ సమయంలో కొంత మందినే బృందాల వారీగా అనుమతించడంతో.. పసికందులను వెంటపెట్టుకుని, మిగిలిన ఒక్క కొడుకును మాత్రం జలంధర్‌లోని పబ్వాన్ గ్రామంలో ఉన్న తన అన్న దగ్గర వదిలేసి వెళ్లింది ఆ తల్లీ. తన అన్న కుటుంబంతో కలిసి తన బిడ్డ పాక్‌కు వస్తాడని, తనను చేరుకుంటాడని అనుకుంది. కానీ.. పరిస్థితుల ప్రభావంతో.. ఆ అన్న భారత్ దాటలేకపోయాడు. ఆపై అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో అతని కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యింది. పబ్వాన్‌లోనే తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచాడు ఆ వ్యక్తి. దీంతో ఆ పసికందు అనాథలా రోడ్డునపడ్డాడు. అయితే నూర్మహల్ ప్రాంతంలో ఉండే ఓ సిక్కు కుటుంబం అతన్ని అక్కున చేర్చుకుంది. పిల్లలు లేకపోవడంతో అమర్జిత్ సింగ్ అని పేరు పెట్టి.. పెంచుకుంది. అలా.. ఆ ఇంటి బిడ్డగానే పెరుగుతూ వచ్చాడు ఆ వ్యక్తి. అయితే.. మమకారంతో పెంచి పెద్ద చేసిన తల్లి చనిపోయే ముందు సొంత కొడుకు కాదనే అసలు విషయం చెప్పింది. దీంతో తనవారెవరో తెలియక.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పబ్వాన్‌లో ఆరా తీయడం మొదలుపెట్టాడు అమర్జిత్ సింగ్. చనిపోయిన తన మేనమామ గురించి వివరాలు తెలిసినా.. ఆ కుటుంబ సభ్యులు ఏమైపోయారనే విషయం మాత్రం తెలీయకుండా పోయింది. ఈ లోపు.. వయసు పైబడి వీల్‌చైర్‌కు అంకితమైపోయాడు అమర్జిత్. తన పూర్వీకుల కోసం ఆ పెద్దాయన చేస్తున్న ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు తోడైనా కూడా లాభం లేకుండా పోయింది. ఈలోపు.. పాక్ నుంచి ఓ జర్నలిస్ట్.. పబ్వాన్‌లో ఉంటున్న ఉద్యమకారుడు హాన్స్ రాజ్‌కు ట్విటర్ ద్వారా కాంటాక్ట్‌లోకి వచ్చాడు. ఫలానా వ్యక్తి అంటూ అమర్జిత్ మేనమామ గురించి ఆరా తీశాడు. ఈ క్రమంలో అమర్జిత్ కాంటాక్ట్‌ను సంపాదించడంతో.. అవతల ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బుధవారం కార్తార్‌పూర్ గురుద్వార దగ్గర అమర్జిత్ సింగ్ పాక్ నుంచి వచ్చిన ఓ మహిళను కలిశాడు. ఆమె ఎవరో కాదు.. ఆయన సోదరి(చెల్లి) కుల్సుం. తాను పాక్‌కు వలస వెళ్లాక పుట్టానని, తల్లి ఏనాడో చనిపోయిందని.. అక్క కూడా ఆమధ్య చనిపోతూ సోదరుడి విషయం చెప్పిందని, అలా తన బంధం కోసం వెతుకుంటూ వచ్చానని ఖుల్సుం వివరించింది. పాక్‌కు చేరుకున్న అమర్జిత్ తల్లి.. తన భర్త స్నేహితుడైన దారా సింగ్ అనే వ్యక్తి ద్వారా ఆ చిన్నారి కోసం వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందట. దీంతో ఆమె కొడుకు ఎక్కడో దగ్గర క్షేమంగా ఉంటాడని ఆశిస్తూ ఇన్నేళ్లు గడిపింది. ఏదేమైతేనేం మొత్తానికి.. రక్తసంబంధం కలిసింది.. ఈ కథ పలువురిని కదిలించింది కూడా. ఇదీ చదవండి: అసాధ్యం అనుకుంటే.. సుసాధ్యం చేసిందామె! -
పెళ్లి చేసుకుందామని వచ్చి శవమై తేలాడు..!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్కానా సాహిబ్ గురుద్వారపై దాడి ఘటనను మరువకముందే సిక్కు వర్గానికి చెందిన ఓ యువకుడు పెషావర్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. రవిందర్ సింగ్ (25) హత్యకు గురయ్యాడని, నిందితులను అదుపులోకి తీసుకున్నామని అక్కడి పోలీసులు తెలిపారు. ఖైబర్-పక్తుంక్వా ప్రాంతానికి చెందిన రవిందర్ మలేషియాలో నివాసముండేవాడు. వివాహం చేసుకునేందుకు పాకిస్తాన్‌కు వచ్చిన రవిందర్ హత్యకు గురవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కాగా, మృతుడు పాక్ ఎలక్ట్రానిక్ మీడియాలో తొలి సిక్కు జర్నలిస్టుగా గుర్తింపు పొందిన హర్మీత్‌సింగ్ సోదరుడు కావడం గమనార్హం. (చదవండి : పాక్‌లో గురుద్వారాపై దాడి.. పలువురి ఖండన) ఇక ఈ హత్యోదంతంపై భారత్ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పాక్‌లోని సిక్కులకు, గురుద్వారలకు రక్షణ కరువైందని బీజేపీ నేతలు మండిపడ్డారు. రవిందర్‌ను హతమార్చిన దోషుల్ని కఠినంగా శిక్షంచాలని భారత విదేశాంగ శాఖ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను డిమాండ్ చేసింది. ఇదిలాఉండగా..నాన్కానా సాహిబ్ గురుద్వార వద్ద జరిగేది ఒకటైతే.. బయట ప్రచారం వేరేలా ఉందని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు పొరుగు దేశాల్లో అణచివేతకు గురౌతున్న మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ తీసుకొచ్చామని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి చెప్పారు. కాగా, 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వచ్చిన ఆరు ముస్లిమేతర వర్గాల ప్రజలకు సీఏఏ భారత పౌరసత్వం కల్పించనుంది. MEA: India calls upon the Government of Pakistan to stop prevaricating & take immediate action to apprehend & give exemplary punishment to the perpetrators of these heinous acts. https://t.co/bEKU34REsF — ANI (@ANI) January 5, 2020 -
తలపాగాతో ప్రవేశానికి అమెరికా బార్ నో
న్యూయార్క్: తలపాగా ధరించిన కారణంగా అమెరికాలో ఓ సిక్కు యువకుడిని బార్లోకి అనుమతించలేదు. అర్థరాత్రి దాటిన తన స్నేహితుడి కలుసుకోవడానికి వెళ్లిన ఆ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు మీడియా పేర్కొంది. గురువీందర్ గ్రేవల్ అనే యువకుడు అర్థరాత్రి తర్వాత తలపాగాతో పోర్ట్ జెఫర్‌సన్‌లోని హర్బర్ గ్రిల్ బార్కి వెళ్లాడు. అక్కడి భద్రతా సిబ్బంది తలపాగా ఉన్న కారణంగా అతడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇది తమ సాంప్రదాయం అని మేనేజర్‌కి వివరించినా ప్రవేశానికి అనుమతించలేదని గురువీందర్ తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత హర్బర్ గ్రిల్ ఫేస్బుక్లో క్షమాపణలు తెలపడంతో పాటు వివరణ ఇచ్చింది. శుక్రవారం, శనివారాల్లో రాత్రి పది గంటల తర్వాత టోపీలు, హ్యాట్లు ధరించిరావడంపై నిషేధం విధించామని, అంతేకానీ సాంప్రదాయంగా ధరించేవాటిపై ఎలాంటి నిషేధం లేదని చెప్పుకొచ్చింది. -
సెహ్రీ కోసం సిక్కు వృద్ధుడు... వైరల్
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం కావటంతో దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉపవాసం, ప్రార్థనలు, ఇఫ్తార్ల కోలాహలం కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం అరుదైన దృశ్యం దర్శనమిస్తోంది. సెహ్రీ (ఉపవాసానికి ముందుగా అంటే సూర్యోదయానికి ముందుగా తీసుకునే భోజనం) కోసం ఓ సిక్కు వృద్ధుడు సాయం చేస్తున్నారు. సాధారణంగా సెహ్రీ కోసం లౌడ్ స్పీకర్లు లేదా ఇలా డప్పులతో చాటింపు వేయించటం మాములే. అలా చేసేవారిని షహర్ఖ్వాన్ అంటారు. ఈ పనిని ఇస్లాం మతానికి చెందిన వ్యక్తే చేస్తుంటారు. మైనార్టీ తెగలకు చెందిన వారు ఈ పని చేయటం అరుదనే చెప్పొచ్చు. ఓ సిక్కు వ్యక్తి ఈ పని చేస్తుండటం, పైగా కశ్మీర్లో.. అది కూడా సమస్యాత్మక ప్రాంతం అయిన పుల్వామాలో కావటంతో ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పలువురు ఆ వృద్ధుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఉపవాసానికి ముందు తెల్లవారుఝామున ఏదైనా తినడం లేదా త్రాగడాన్ని సెహ్రీ అంటారు.. రోజా(ఉపవాసం) ముగించిన తరువాత అంటే సూర్యాస్తమయం తరువాత తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. -
సెహ్రీ కోసం సిక్కు వృద్ధుడు
-
లండన్‌లో సింగ్ ఈజ్ 'కింగ్' !
లండన్: భారత సంతతికి చెందిన సిక్కు డ్రైవర్ 13 ఏళ్ల బాలికను కాపాడి లండన్‌లో హీరో అయ్యారు. అపహరణకు గురైన బాలికను తన చాకచక్యంతో రక్షించారు సత్బీర్ అరోరా. ఈ ఏడాది ఫిబ్రవరి 20న తన క్యాబ్‌ను ఒకరు బుక్‌చేశారు. అయితే ఎప్పటిలానే అరోరా ప్యాసింజర్‌ను ఎక్కించుకోడానికి వెళ్లగా... అక్కడ స్కూలు యూనిఫాంలోఉన్న విద్యార్థిని ఉంది, ఆమెతో పాటు 24 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరూ క్యాబ్‌లో ఎక్కారు. వీరి వ్యవహారం చూసి అరోరా మనసు ఎందుకో కీడు శంకించింది. కారులో ఎక్కిన వ్యక్తి ఆ బాలికను ఏం చేయబోతున్నాడో ఫోన్లో అవతలి వ్యక్తికి వివరించడాన్ని అరోరా గుర్తించారు. అతని మాటల ద్వారా ఆ బాలిక కిడ్నాప్‌కు గురైందని గ్రహించారు. వెంటనే బాలిక గురించి తెలుసుకోమని తన భార్యకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆమె మాటల ద్వారా బాలిక కిడ్నాప్‌కు గురైందని నిర్ధారించుకున్నారు. దీంతో దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు అరోరా. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కిడ్నాపర్‌ని అరెస్టు చేశారు. ఎంతో తెలివిగా బాలికను రక్షించినందుకు అరోరాకు ‘అవుట్ స్టాండింగ్ ఎచీవ్మెంట్ ఇన్ సేఫ్‌గార్డ్’ సర్టిఫికెట్‌ను అక్కడి జిల్లా కౌన్సిలర్ కీరోన్ మాలన్ అందించారు. -
నిజమైన హీరో అంటే ఈ తాతయ్యనే!
65 ఏళ్ల అవతార్ హోతి, ఆయన కొడుకు పాల్ ఎప్పటిలాగే తమ పంటపొలంలో పనిచేసకుంటున్నారు. వీరి పొలానికి పక్కనే నార్త్ తాంప్సన్ నది కాలువ ఉంది. చలికాలం కావడంతో చల్లటి నీటితో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇంతలోనే ఓ 14 ఏళ్ల అమ్మాయి అరుపులు-కేకలు వినిపించాయి. నదిలో కొట్టుకుపోతూ ఆమె సాయం కోసం అర్థించింది. వెంటనే అవతార్, పాల్ నది దగ్గరకు వెళ్లి చూశారు. కెరటాల్లో కొట్టుకుపోతూ బాధితురాలు కేకలు వేస్తోంది. పాల్‌కు ఏం చేయాలో తోచలేదు. కానీ చురుగ్గా ఆలోచించిన హోతి మాత్రం వెంటనే తలపాగా తీసి.. సాయంగా బాధితురాలి కోసం విసిరాడు. ఆమె దానిని అందుకొని సురక్షితంగా బయటపడింది. నదిలో కొట్టుకుపోతున్న షాక్‌లో ఉన్న ఆమెకు తండ్రీకొడుకులు ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. భారత సంతతికి చెందిన 65 ఏళ్ల హోతిని ఇప్పుడు కెనడాలో అందరూ నిజమైన హీరో అని పొగుడుతున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం కేమ్లూప్స్లో ఉంటున్న ఆయన చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నదిలో కొట్టుకుపోతున్న అమ్మాయికి తలపాగాను తాడులా అందించి.. ఒడ్డుకు తీసుకురావడమే కాదు.. చలినీటిలో గడ్డకట్టుకుపోయిన ఆమె కోలుకునేలా తండ్రీ-కొడుకులు సపర్యలు చేశారు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత బాధితురాలిని తమ కారులో సమీపంలోని ఆమె బామ్మ ఇంట్లో వదిలిపెట్టి వచ్చామని పాల్ తెలిపాడు. సమయస్ఫూర్తితో తన తండ్రి చేసిన సాహసం తనకు గర్వకారణంగా ఉందని అతను సీబీసీ న్యూస్‌కు తెలిపాడు. -
బ్రిటన్‌లో సిక్కు యువకుడిపై జాత్యహంకార దాడి
బ్రిటన్ లో జాత్యహంకారం మరోసారి పేట్రేగింది. బర్మింగ్‌హోమ్‌లోని బోర్డ్ స్ట్రీట్‌లో ఒంటరిగా తనదారిన తాను వెళుతోన్న ఓ సిక్కు యువకుణ్ని కొందరు దుండగులు అటకాయించి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానిక సిక్కులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. 'డైలీ సిఖ్ అప్డేట్స్' అనే ఫేస్బుక్ సైట్లో ఉంచిన దాడి తాలుకూ వీడియోల ఆధారంగా బ్రిటన్ పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. ఆదివారం రాత్రి జరిగినట్లుగా భావిస్తున్న ఈ దుశ్చర్యను జాత్యహంకార దాడిగానే భావిస్తున్నామని, అయితే బాధితుడు ఎవరనేది తెలియరాలేదని, ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తే అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని మంగళవారం బర్మింగ్ హోమ్ పోలీసులు తెలిపారు. -
వివక్షకు గురైన సిక్కు పౌరుడికి పరిహారం
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో వివక్షకు గురైన సిక్కు పౌరుడొకరు పరిహారం పొందాడు. వివక్ష చూపి తనకు ఉద్యోగం రాకుండా చేసిన సంస్థ నుంచి 50 వేల డాలర్లు పరిహారం అందుకున్నాడు. పారామస్కు చెందిన గురుప్రీత్ ఎస్. కెర్హా(29) గడ్డం కలిగివున్నాడనే కారణంతో 2008లో వివక్షకు గురయ్యాడు. లిటిల్ ఫాల్స్‌లోని కారు డీలర్షిప్ కంపెనీ ట్రై-కౌంటీ లెక్సస్‌లో ఉద్యోగానికి గురుప్రీత్ దరఖాస్తు చేశాడు. అయితే గడ్డం కలిగివున్నాడనే కారణంతో అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ఆ కంపెనీ నిరాకరించింది. దీనిపై గురుప్రీత్ న్యాయపోరాటానికి దిగాడు. సమాన ఉపాధి, అవకాశాల సంఘాన్ని ఆశ్రయించాడు. చివరకు అతడికి 50 వేల డాలర్ల పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు రావడంతో వివాదం పరిష్కారమయింది. ఈ మేరకు నవంబర్ 15న సమాన ఉపాధి, అవకాశాల సంఘంతో నెవార్క్‌తో ట్రై-కౌంటీ లెక్సస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తమ కంపెనీపై వచ్చిన వివక్ష ఆరోపణలను ట్రై-కౌంటీ లెక్సస్ తోసిపుచ్చడం గమనార్హం. -
లండన్‌లో జాత్యాహంకార దాడి