
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాన్వి కపూర్ పాకిస్తాన్‌కు చెందిన ఓ పత్రికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిని యావత్ ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయం తెలిసిందే. కానీ పాకిస్థాన్‌కు చెందిన ఓ పత్రిక తమ దేశానికి అనుకూలంగా ప్రచురించుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి దాడిలో జవాన్లు చనిపోయారంటూ మొదటి పేజీలో ఓ కథనాన్ని రాసుకుంది. దీనిపై స్పందించిన జాన్వి.. ‘‘ఉగ్రవాదిని స్వాతంత్ర్య సమరయోధిడిగా వర్ణిస్తారా. చేసిన తప్పును సమర్థించుకుంటారా?. జవాన్ల మృతిని పక్క దేశం సంబరం చేసుకోవడం బాధాకరంగా ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు జాన్వి పాక్ పత్రిక ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఉగ్రదాడిలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధకు, ఆగ్రహానికి గురి చేసింది. ఈ పత్రిక ఉగ్రదాడిని తమ స్వతంత్రం కోసం పోరాటం అంటూ సెలబ్రేట్ చేసుకుంటోంది. తీవ్రంగా ఖండించాల్సిన ఇలాంటి ఘోరమైన ఘటనకు సంబంధించిన నిజాల్ని మీడియా వక్రీకరించడం నిజంగా బాధ్యతారహితం. ఈ ఉగ్రవాది జవాన్ల జీవితాల్ని నాశనం చేయడమే కాదు దేశం కోసం పోరాడే వ్యక్తులును, వారికి ఉన్న గౌరవాన్ని కూడా కించపరిచారు. ప్రాణాలు త్యాగం చేసిన మన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు శక్తిని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్న. జైహింద్’ అని జాన్వి పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment