వదిలిపెట్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం: సీఆర్పీఎఫ్‌ | CRPF Tweets This Heinous Attack Will be Avenged | Sakshi
Sakshi News home page

ఎవ్వరినీ వదిలిపెట్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం: సీఆర్పీఎఫ్‌

Published Fri, Feb 15 2019 1:36 PM | Last Updated on Fri, Feb 15 2019 5:16 PM

CRPF Tweets This Heinous Attack Will be Avenged - Sakshi

న్యూఢిల్లీ : ఉగ్రదాడికి కారుకులైన ఏ ఒక్కరిని వదిలి పెట్టమని, అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ సీఆర్పీఎఫ్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో భావోద్వేగమైన వ్యాఖ్యలను చేసింది.

‘మేం ఎప్పటికీ మరిచిపోలేం, ఎవ్వరిని వదిలిపెట్టం.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మా సోదరులకు మేం సెల్యూట్‌ చేస్తున్నాం. వారి కుటుంబాలకు అండగా ఉంటాం. ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం.’   భావోద్వేగమైన వ్యాఖ్యలతో ట్వీట్‌ చేసింది. ఇక ఈ దాడిని ఖండించిన నరేంద్ర మోదీ భద్రతా బలగాలకు ఉగ్రవాదుల ఏరివేత విషయంలో పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘సైనికుల త్యాగం వృథా పోదు.. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెబుతాం’ అని కేబినెట్‌ సమావేశం అనంతరం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో విపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. మోదీ తీసుకుబోయే నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. దీంతో మరో సర్జికల్‌ స్ట్రైక్‌ జరగనుందా అనే చర్చ నడుస్తోంది. (చదవండి: పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement