జవాన్ల కుటుంబాలకు స్టార్‌ హీరో భారీ విరాళం! | Akshay Kumar Likely To Donate Huge Amount To Soldiers Families | Sakshi
Sakshi News home page

జవాన్ల కుటుంబాలకు స్టార్‌ హీరో భారీ విరాళం!

Published Mon, Feb 18 2019 1:59 PM | Last Updated on Mon, Feb 18 2019 4:57 PM

Akshay Kumar Likely To Donate Huge Amount To Soldiers Families - Sakshi

ముంబై : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలకు సహాయం అందించేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. పుల్వామా ఘటనను ఖండించిన పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు బాధిత కుటుంబాలకు విరాళాలు ప్రకటిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌... ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు చొప్పున విరాళంగా మొత్తం రూ. 2.5 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కిలాడి అక్షయ్‌ కుమార్‌ ముందుకు వచ్చాడు.

ఇప్పుడు స్పందించండి..
‘ పుల్వామా వంటి ఘటనలు మనం మర్చిపోలేము. మన అందరం ప్రస్తుతం కోపంతో ఊగిపోతూ ఉన్నాం. స్పందించాల్సిన సమయం వచ్చింది. స్పందిద్దాం రండి.. అమర జవానుల కుటుంబాలకు సహాయం చేద్దాం. వారి రుణం తీర్చుకునేందుకు ఇంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు. అయితే అఫీషియల్‌ సైట్‌(భారత్‌కే వీర్‌) ద్వారా విరాళాలు అందించి మద్దతు తెలపండి. నకిలీ అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ ట్విటర్‌ ద్వారా అక్షయ్‌ కుమార్‌ విఙ్ఞప్తి చేశాడు. అంతేకాకుండా తన వంతు సాయంగా సుమారు 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వనున్నాడని ఓ జాతీయ మీడియా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement