న్యూఢిల్లీ : భద్రతా బలగాలను తరలించే ముందు ఆ రూట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అణువణవు పరీక్షిస్తారు. రోడ్ ఓపెనింగ్ పార్టీలు ముందుగా వెళ్లి తనిఖీలు నిర్వహిస్తాయి. గురువారం జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడక ముందు కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ స్థానికులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో వారి వాహనాలను అనుమతించారు. ఇదే సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకుంది. స్థానికుని నెపంతో సర్వీస్ రోడ్డుపై నుంచి దూసుకొచ్చిన ఉగ్రవాది అదిల్ అహ్మద్ ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. గురువారం జరిగిన ఈ ఆత్మహుతి దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. (చదవండి : ఉగ్ర మారణహోమం)
Comments
Please login to add a commentAdd a comment