ఇన్నిరోజులు మౌనంగా భ‌రించా : క‌నికా క‌పూర్ | Kanika Kapoor Enjoys Family Time After Recovering From Corona | Sakshi
Sakshi News home page

ఇన్నిరోజులు మౌనంగా భ‌రించా : క‌నికా క‌పూర్

Published Mon, Apr 27 2020 1:53 PM | Last Updated on Mon, Apr 27 2020 2:19 PM

Kanika Kapoor Enjoys Family Time After Recovering From Corona - Sakshi

ల‌క్నో:  ఇటీవ‌ల క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన ప్ర‌ముఖ బాలీవుడ్ గాయ‌ని క‌నికా క‌పూర్ కుటుంబంతో స‌ర‌దాగా గ‌డుపుతున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. తల్లిదండ్రుల‌తో కూర్చొని  బాల్క‌నీలో స‌ర‌దాగా  టీని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా క‌నిపించారు. ఈ ఫోటోను క‌నికా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 21 రోజులు  ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోనే ఉన్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, ఈ సంద‌ర్భంగా ఎమోష‌న‌ల్‌గా ఎంతో తోడ్పాడునందించిన వైద్య  సిబ్బందికి కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు.
(కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయ‌ని)


 క‌రోనాకు సంబంధించి  త‌న‌పై చాలా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని, వాటిలో త‌న త‌ప్పేమి లేద‌ని అంటోంది క‌నికా క‌పూర్‌. లండ‌న్ నుంచి తిరిగి వ‌చ్చాక త‌న‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని, దీంతో అంద‌రితో సాధార‌ణంగా మెలిగానని చెప్పింది. అయితే ల‌క్నోలో త‌ను గ్రాండ్ పార్టీ ఏర్పాటుచేసిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని, ఓ స్నేహితుడు ఏర్పాటు చేసిన పార్టీకి   తాను హ‌జ‌రైన‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇన్ని రోజులు త‌న‌పై పెద్ద ఎత్తున అస‌త్య ప్రచారాలు జ‌రుగుతున్నా మౌనంగా ఉన్నానని, దీన‌ర్థం త‌ప్పు చేసిన‌ట్లుకాదు అని పేర్కొంది.

ఈ క‌ష్ట‌కాలంలో త‌న‌కెంతో అండ‌గా నిలిచిన కుటుంబ‌స‌భ్యులు, స్నేహితుల‌కి ధ‌న్య‌వాదాలు అంటూ ట్వీట్ చేసింది. కాగా విదేశాల నుంచి వ‌చ్చి విష‌యం దాచిపెట్టి ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హ‌జ‌రైన క‌నికా కపూర్‌పై సెక్ష‌న్ 269, 270 కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ఆసుప‌త్రిలో చికిత్స పొందిన ఆమెకు ఐదోసారి నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌లో నెగిటివ్ రావ‌డంతో డిశ్చార్జ్ అయిన సంగ‌తి తెలిసిందే.  

చ‌ద‌వండి :  (కనికాకు కరోనా : కేసు నమోదు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement