ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన కనిక! | Kanika Dhillon Hits Back Troll Who Mistaken Her Kanika Kapoor | Sakshi
Sakshi News home page

మీ మెదడుకు వైరస్‌ సో​​కింది.. నమస్తే!

Mar 21 2020 4:36 PM | Updated on Mar 21 2020 5:02 PM

Kanika Dhillon Hits Back Troll Who Mistaken Her Kanika Kapoor - Sakshi

ముంబై: ‘‘సర్‌.. మీ మెదడులో వైరస్‌ ప్రవేశించింది... ప్రతీ కనికను జైల్లో పెట్టాలని కోరుకుంటున్నారా? మెదడును వెలిగించుకోండి.. ప్రేమను పంచండి.. ఇంట్లో కూర్చోండి... సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోండి’’అని సినీ రచయిత కనికా థిల్లాన్‌ ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసత్య వార్తలు ప్రచారం చేయడం మానుకోవాలంటూ హితవు పలికారు. సినీ నేపథ్య గాయని కనికా కపూర్‌ తనకు కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సోకిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పలు పార్టీలకు హాజరుకావడంతో.. అక్కడికి వచ్చిన ఎంపీలు, మంత్రులు, రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహా ఇతర ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ క్రమంలో కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టారంటూ కనికా కపూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.(కనికాకు కరోనా : కేసు నమోదు)

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ కనికా కపూర్‌కు బదులు.. కనికా థిల్లాన్‌ను ట్యాగ్‌ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘ నీతో పాటు ఇతరులకు కూడా వైరస్‌ సోకేలా చేశావు. నిన్ను నువ్వు సెలబ్రిటీ అని చెప్పుకుంటూ తిరుగుతావు కదా. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటావు. నిన్ను జైల్లో కూర్చోబెట్టాలి’’అంటూ #కనికాకపూర్‌క్రిమినల్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ జతచేశాడు. ఇందుకు స్పందించిన కనికా థిల్లాన్‌ అతడి అవగాహనా రాహిత్యాన్ని ఎండగట్టారు. అంతేకాదు కరోనా వ్యాప్తి చెందకుండా మీ వంతు బాధ్యత నెరవేర్చాలని సూచించారు. కాగా సైజ్‌ జీరో, మన్‌మర్జియాన్‌, జడ్జిమెంటల్‌ హై క్యా తదితర చిత్రాలకు స్క్రిప్టు రైటర్‌గా పనిచేసిన కనికా థిల్లాన్‌... దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే తాము విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఇక ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే 271 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా నాలుగు కరోనా మరణాలు సంభించాయి. ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా ఈ మహమ్మారికి బలయ్యారు.(హీరోయిన్‌కు కరోనా.. బ్రేకప్‌ చెప్పిన ప్రియుడు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement