వైరల్‌ : ప్రిన్స్‌ చార్లెస్‌తో కనికా.. | Kanika Kapoor With Prince Charles Old Photos Goes Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ : ప్రిన్స్‌ చార్లెస్‌తో కనికా..

Published Thu, Mar 26 2020 12:56 PM | Last Updated on Thu, Mar 26 2020 12:56 PM

Kanika Kapoor With Prince Charles Old Photos Goes Viral - Sakshi

కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ పేరు ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆమె లండన్‌ నుంచి తిరిగివచ్చాక కరోనా నిర్ధారణ కాకముందు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా పార్టీలకు హాజరుకావడం కొద్ది రోజుల కిందట హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. దీంతో కనికా నిర్లక్ష్యంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

తాజాగా కనికా కపూర్‌ మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు. బ్రిటన్‌ రాజకుమారుడు చార్లెస్‌ను కనికా కలిసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో ప్రిన్స్‌ చార్లెస్‌తో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అయితే ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ఈ ఫొటోలు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అక్కడే సమస్య మొదలైందని ఒకరు, యూపీ టూ యూకే అని మరోకరు ట్వీట్‌లు చేస్తున్నారు. కాగా, ఆ ఫొటోలు ఇప్పటివి కావని.. 2015 ప్రిన్స్‌ చార్లెస్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి చెందినవిగా తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న కనికాకు మూడోసారి నిర్వహించిన పరీక్షలోనూ కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.

చదవండి : కరోనా: ఇంకా కోలుకోని కనికా కపూర్‌

బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌కూ కరోనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement