Old Photos
-
పాత ఫొటోలతో విష ప్రచారం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రహదారులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తోందని, నిధులు కూడా కేటాయించామని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనాడు పత్రిక పాత ఫొటోలు వేసి తప్పుగా ప్రచారం చేసిందని, ద్వారకానగర్‌లో జూన్ 6వ తేదీలోపు రహదారులు వేసినట్టు స్పష్టం చేశారు. ఇక్కడే మరమ్మతులు కూడా చేపట్టామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మరమ్మతులు జరిగిన రహదారుల్లో పాత ఫొటోలతో పత్రికలో వేసి వార్తలు రాయడం దారుణమన్నారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరగదు కదా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రహదారులన్నీ ఛిద్రంగా మారాయని, దాని వల్లే ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయన్నారు. పాత ఫొటోలు వేసి పచ్చ పత్రిక ప్రభుత్వంపై బురద జల్లేందుకు కంకణం కట్టుకుందన్నారు. జీవీంఎసీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్లు సూచనలు, సలహాలు మేరకు పనులు చేపడుతున్నట్టు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో అన్ని వార్డుల్లో మొత్తం 6,900 గుంతలను, రహదారులను గుర్తించడం జరిగిందని, ఇందులో సుమారు 3,200 గుంతలను 9 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసినట్టు చెప్పారు. మిగిలిన 3,700 గుంతలు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే వార్డుల్లో పనుల కోసం ఒక్కొ కార్పొరేటర్‌కు రూ.కోటి 50 లక్షల కేటాయించామన్నారు. ఈ పనులు కూడా టెండర్లు పిలిచి త్వరగా చేపట్టాలని, వచ్చే సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గ్రామీణా ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు పథకం నిధులు కేటాయింపు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రహదారుల కోసం రూ.1,073 కోట్లు కేటాయించామన్నారు. అలాగే మన్యం ప్రాంతాల్లో కూడ పీఆర్, ఆర్అండ్బీ రహదారులు వేయాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శ, ఆర్డీవో డి.హుస్సేన్ సాహెబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మెరిసిన మన్యం బిడ్డ) -
పాత ఫొటోల్ని క్వాలిటీగా కోరుకుంటున్నారా?
ఫొటోల్ని భద్రంగా దాచుకోవడం పెద్ద సవాల్‌గా ఫీలవుతుంటారు చాలామంది. ఆల్బమ్‌కు అత్కుకుపోవడం, మరకలు, చినుగుళ్లు.. ఇలాంటివి గుర్తులను చెరిపేసే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఆ పాత ఫొటోల్ని క్వాలిటీగా మార్చేందుకు రెండు పెయిడ్ మోడల్స్‌ను తీసుకొచ్చింది గూగుల్. గూగుల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బ్లాగ్ ద్వారా ఇమేజ్ సూపర్ రీ-సొల్యూషన్(ఎస్ఆర్3), కాస్కాడెడ్ డిఫుషన్ మోడల్స్(సీడీఎం) పేరుతో మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా పాత తరం ఫొటోల్ని క్వాలిటీ మోడల్స్‌లోకి మార్చడంతో పాటు బ్లర్ ఇమేజ్‌లను హై రెజల్యూషన్ మోడ్‌లోకి మార్చేయొచ్చు. ఇమేజ్ సూపర్ రెజల్యూషన్(ఎస్ఆర్3).. లో రెజల్యూషన్ ఫొటోల్ని హైరెజల్యూషన్‌కు మారుతుంది. బాగా డ్యామేజ్, మరకలు ఉన్న పాత ఫొటోల్ని సైతం క్లారిటీ మోడ్‌కు తీసుకొస్తుంది. మల్టీపుల్ అప్లికేషన్స్‌తో పనిచేసే ఈ టెక్నాలజీకి సంబంధించి డెమోను సైతం బ్లాగ్‌లో ఉంచింది గూగుల్ ఏఐ. చదవండి: దేశంలో VPN బ్యాన్? కాస్కాడెడ్ డిఫుషన్ మోడల్స్(సీడీఎం).. ఫొటోల్ని సహజంగా అందంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగించే టెక్నాలజీ ఇది. ఇంతకు ముందు ఉన్న ఇమేజ్‌నెట్ కష్టంగా మారడంతో.. ఈ కొత్త మోడల్‌ను డెవలప్ చేసినట్లు పేర్కొంది గూగుల్. ఇమేజ్ రెజల్యూషన్‌ను పెంచడంతో పాటు ఫొటోల్ని నేచురల్‌గా చూపించనుంది ఈ ఏఐ మోడల్. ఈ రెండింటితో పాటు అగుమెంటేషన్ టెక్నిక్ ‘కండిషనింగ్ అగుమెంటేషన్’ను సీడీఎంకు సమానంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది గూగుల్. 64x64 రెజల్యూషన్ ఈమేజ్‌ను 264x264 రెజల్యూషన్కి, ఆపై 1024x1024కి మార్చనుంది సీడీఎం మెథడ్. అయితే పాత ఫొటోల్ని క్వాలిటీకి మార్చే క్రమంలో.. డిజైన్ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని, వాటిని అధిగమించే ప్రయత్నం చేయనున్నట్లు గూగుల్ ఏఐ బ్లాగ్ పేర్కొంది. చదవండి: వర్క్‌ఫ్రమ్ హోంపై గూగుల్ కీలక ప్రకటన -
వైరల్ : ప్రిన్స్ చార్లెస్‌తో కనికా..
కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పేరు ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఆమె లండన్ నుంచి తిరిగివచ్చాక కరోనా నిర్ధారణ కాకముందు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా పార్టీలకు హాజరుకావడం కొద్ది రోజుల కిందట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. దీంతో కనికా నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా కనికా కపూర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్‌ను కనికా కలిసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో ప్రిన్స్ చార్లెస్‌తో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అయితే ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ఈ ఫొటోలు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అక్కడే సమస్య మొదలైందని ఒకరు, యూపీ టూ యూకే అని మరోకరు ట్వీట్లు చేస్తున్నారు. కాగా, ఆ ఫొటోలు ఇప్పటివి కావని.. 2015 ప్రిన్స్ చార్లెస్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి చెందినవిగా తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న కనికాకు మూడోసారి నిర్వహించిన పరీక్షలోనూ కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. చదవండి : కరోనా: ఇంకా కోలుకోని కనికా కపూర్ బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా -
డిస్కౌంట్ ధరలో అపూర్వ చిత్రాలు
సాక్షి, సిటీబ్యూరో: పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన ‘70 ఏళ్ల స్వాతంత్య్రం – త్యాగాలను స్మరిద్దాం’ ఫొటో ఎగ్జిబిషన్ అరుదైన దృశ్యాల వేదికగా నిలుస్తోంది. దేశమంతా ఏకమై బానిస సంకెళ్లు తెంచిన ఘట్టాల చిత్రాలు అందరిలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి.1857 నుంచి మొదలైన స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకొని స్వేచ్ఛా వాయువులు లభించిన 1947 ఆగస్టు 15 వరకు, తదనంతరం దేశంలో చోటుచేసుకున్న పరిణామాల దృశ్యమాలిక అందరినీ కట్టిపడేస్తోంది. కేవలం అరుదైన ఫొటోలే కాకుండా.. అపూర్వమైన పుస్తకాలూ కొలువు దీరాయి. మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుల విజయగాథలు, జీవితచరిత్ర తదితర పుస్తకాలు అందుబాటులో ఉంచారు. వీటిని డిస్కౌంట్ ధరకు సృదర్శకులకు విక్రయిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులు వెళ్లొచ్చు. ఆనాటి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాల్లో భాగంగా 1857 సెప్టెంబర్ 14న కమాండర్ కేంపీబెల్ సేనల దాడిలో ఛిద్రమైన కాశ్మీర్ గేటుతోపాటు స్వాతంత్య్ర తొలి వేడుకలు, సైనికులు కవాలు, విద్యుత్ వెలుగుల్లో ఢిల్లీ గేట్, తొలి కేబినెట్ భేటీ, తొలి రాష్ట్రపతిగా, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహోన్నతులు, కార్గిల్ యుద్ధ చిత్రాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముద్ర, సంస్థానాల విలీనం, దేశానికి రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానులుగా పనిచేసినవారి ఫొటోలు ప్రదర్శనలో ఉంచారు. -
ఈమె ఎవరో చెప్పుకోండి చూద్దాం!
మిస్ వరల్డ్ నుంచి పద్మశ్రీ అవార్డు గ్రహీత వరకు ఉన్నత ప్రస్థానాన్ని సాగించింది ఈ చిన్నదేనా? అంటే నమ్మడం కష్టమే. తొలి యవ్వనప్రాయంలో దిగిన ఈ ఫొటోలు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రావే.. అంటే మన కళ్లు మనల్ని మోసం చేస్తున్నాయా.. ప్రియాంక ఇంతగా మారిపోయిందా? అనిపిస్తోంది కదూ.. బాలీవుడ్ టాప్ హీరోయిన్గా కొనసాగుతూ ఓ సారి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా గెలుపొందిన ప్రియాంక తాజాగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ప్రస్తుతం కెరీర్లో టాప్ స్పీడ్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నది. నటనలో తనదైన మార్క్‌తో పెద్ద ఎత్తున అభిమానుల్సి సొంతం చేసుకున్న ఈ ముద్దగుమ్మ యవ్వనప్రాయంలోని ఫొటోలు ఇటీవల ఇంటర్నెట్లో వెలుగుచూశాయి. ఈ ఫొటోలు కొన్నింటినీ ప్రియాంకనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా.. మరికొన్నింటినీ ఆమె మిత్రులు షేర్ చేశారు. ఈ ఫొటోలను చూస్తే ఈ కుందనపు బొమ్మ ప్రియాంక చొప్రానేనా అనిపిస్తుంది కదూ!