లక్నో : ఇటీవల కరోనా నుంచి బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ నుంచి లక్నో పోలీసులు పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత లక్నోలో ఆమె పాల్గొన్న పార్టీల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటిపై ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. లండన్ నుంచి మార్చి10న ఇండియాకు తిరిగివచ్చిన క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి పలు పార్టీలకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఒక్కసారిగా సంచలనం రేపింది. దీంతో ఆమె హాజరైన పార్టీల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం కనికా కపూర్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే కనికాకు ఐదు సార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన వ్యక్తం అయింది. అయితే ఆ తర్వాత రెండుసార్లు జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. దీంతో కొద్ది రోజుల కిత్రం ఆమెపై నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కనికాకు నోటీసులు అందజేశారు. మరోవైపు ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్న కనికా.. ఇటీవల కోలుకున్న కనికా కరోనా పేషెంట్ల కోసం తన ప్లాస్మాను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధికారులను సంప్రదించి తన రక్త నమూనాలను ఇచ్చారు.
చదవండి : కనికా కపూర్ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment