Lucknow police
-
కనికా వాంగ్మూలం రికార్డు..
లక్నో : ఇటీవల కరోనా నుంచి బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ నుంచి లక్నో పోలీసులు పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత లక్నోలో ఆమె పాల్గొన్న పార్టీల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీటిపై ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. లండన్ నుంచి మార్చి10న ఇండియాకు తిరిగివచ్చిన క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి పలు పార్టీలకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఒక్కసారిగా సంచలనం రేపింది. దీంతో ఆమె హాజరైన పార్టీల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. దీంతో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కనికా కపూర్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే కనికాకు ఐదు సార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన వ్యక్తం అయింది. అయితే ఆ తర్వాత రెండుసార్లు జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. దీంతో కొద్ది రోజుల కిత్రం ఆమెపై నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కనికాకు నోటీసులు అందజేశారు. మరోవైపు ప్రాణాంతక కరోనా నుంచి కోలుకున్న కనికా.. ఇటీవల కోలుకున్న కనికా కరోనా పేషెంట్ల కోసం తన ప్లాస్మాను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధికారులను సంప్రదించి తన రక్త నమూనాలను ఇచ్చారు. చదవండి : కనికా కపూర్ సంచలన నిర్ణయం -
'టైపిస్టు పెద్దాయనకు పోలీసుల పహారా'
లక్నో: రోజువారి పనులకోసం ఆ పెద్దాయన సిద్ధమవుతున్నాడు. చేతిలోకి తన టైప్ రైటర్ తీసుకుని బయలుదేరడానికి ముందు తుడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక్కసారిగా పోలీసులు వచ్చారు. వారు ఎందుకొచ్చారో అర్ధంకాని ఆ పెద్దమనిషికి గుండెలో గుబులు. ఇంతలో పోలీసుల నుంచి ఒక మాట' పదండి పెద్దాయన మీకు తోడుగా వస్తాం.. మిమ్మల్ని దిగబెట్టి అక్కడే ఉంటాం' అని.. ఈ మాటలు విని అతడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తాను ఇచ్చిన ఫిర్యాదు గుర్తుచేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దాదాపు 35 ఏళ్లుగా లక్నో జనరల్ పోస్టాపీసు ముందు కూర్చుని తన పాత టైప్ రైటర్ సాయంతో బతుకీడుస్తున్న కిషన్ కుమార్ (65) అనే పెద్దాయనపై ఓ ఎస్సై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయన టైప్ రైటర్‌ను కూడా ఆ ఎస్సై ధ్వంసం చేశాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసి చివరికి ఆ ఎస్సై ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. అయితే, కిషన్ కుమార్‌కు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని పోలీసులను ఎస్కార్ట్‌గా పంపిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సోమవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కిషన్ కుమార్‌కు ఫోన్ కాల్ వచ్చింది. 'నువ్వు చేసింది మంచి పని కాదు.. నీ పనిచెప్తా' అంటూ ఫోన్ చేసిన వ్యక్తి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఫోన్ కాల్ తిరిగి చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ వచ్చింది ఇంటర్నెట్ ద్వారా. దీంతో పోలీసుల కిషన్ కుమార్‌కు భద్రత కల్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
'టైపిస్టు పెద్దాయనకు పోలీసుల పహారా'
-
మా నాన్న సహకరిస్తారు: సీమాంతో
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ తనకు తానుగా లక్నో పోలీసుల ముందు లొంగిపోయారని ఆయన తనయుడు సీమాంతో రాయ్ తెలిపారు. దర్యాప్తు అధికారులకు తన తండ్రి పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. సుబ్రతారాయ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో సీమాంతో ఢిల్లీలో హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 26నే సుప్రీంకోర్టు ఎదుట హాజరుకావాలని భావించి సుబ్రతారాయ్ 24న ఢిల్లీ వచ్చారని తెలిపారు. అయితే నాన్నమ్మ అనారోగ్యానికి గురవడంతో లక్నోకు తిరిగివెళ్లారని వివరించారు. సుప్రీంకోర్టులో తన తండ్రికి ఊరట లభిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుబ్రతారాయ్ కనిపించకుండాపోయారని మీడియాలో వార్తలు రావడం తమకు బాధ కలిగించిందని సీమాంతో పేర్కొన్నారు. తమపై వచ్చిన ఆరోపణలన్నీ త్వరలో వీగిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, నాటకీయ పరిణామాల మధ్య సుబ్రతారాయ్‌ను ఈ ఉదయం లక్నో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.