
దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్
పెళ్లిరోజున వధూవరుల పెళ్లి వస్త్రాలు ముడేస్తారు... జీవితాంతం కలిసుండాలని. భర్తను కొంగున కట్టేసుకోవాలనుకుంటారు కొందరు భార్యలు. రణ్‌వీర్ సింగ్ అయితే ‘నీ కొంగు విడవనులే’ అని భార్య దీపికా పదుకోన్‌కి హామీ ఇచ్చారు. దీప్‌వీర్ పెళ్లి రిసెప్షన్ బుధవారం బెంగళూర్‌లో జరిగింది. ఈ సందర్భంగా బయటికొచ్చిన ఫొటోల్లో కింద ఉన్న ఫొటో ఓ హైలైట్. మీడియాని ఉద్దేశించి ‘‘ఎల్లరికీ నమస్కార, ఎల్లా చనాయ్‌గా ఇద్దరా’ (అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారా) అని దీపికా కన్నడంలో మాట్లాడితే, ‘‘ఖానా కా కే జానా’ (భోజనం చేసి వెళ్లండి) అని రణ్‌వీర్ హిందీలో అన్నారు. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment