
కర్నూలు ,పత్తికొండ రూరల్: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు పోలీసులు, వైద్యాధికారులు, ఇతర అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తుంటే మంగళవారం పత్తికొండలో తమకేమీ పట్టనట్లు వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేసుకుని వందలాది మంది ఒకేచోట చేరారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ గుర్రప్ప, స్పెషల్‌బ్రాంచ్ ఎస్‌ఐ నరసప్ప అక్కడికి వెళ్లి హెచ్చరికలు జారీ చేసి పంపించి వేశారు. ఇందులో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉండటం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment