నటుడు–నిర్మాత మంచు మోహన్‌బాబు సినీ జర్నీ గోల్డెన్ జూబ్లీ ఇయర్‌లోకి అడుగుపెట్టింది. యాభై ఏళ్ల కెరీర్లో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో ఘనవిజయాలను చూశారు మోహన్‌బాబు. నేటితో సినీ పరిశ్రమలో హీరోగా 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
సినిమాల్లోకి రాక ముందు ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేశారు. అయితే సినీ పరిశ్రమపై ఎనలేని ఆసక్తితో మద్రాస్ వెళ్లి, అవకాశాల కోసం ఎంతో శ్రమించారు మోహన్‌బాబు. అలా ఒకట్రెండు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన మోహన్‌బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘స్వర్గం నరకం’ (1975). డా. దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
నవంబరు 22న విడుదలైన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమా విడుదలై, గురువారంతో నలభైతొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ‘స్వర్గం నరకం’తో హీరోగా వెండితెరకు పరిచయమైన మోహన్‌బాబు కెరీర్ మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రలనే పోషించారు. 1975–1990 సమయంలో విలన్‌గా విజృంభించారు. హీరోగా ‘అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. 75 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్‌బాబు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment