Manchu Mohan Babu Brother Ranga Swamy Passed Away At Tirupati - Sakshi
Sakshi News home page

Manchu Mohan Babu: మంచు మోహన్‌బాబు ఇంట తీవ్ర విషాదం

Nov 17 2021 7:51 PM | Updated on Nov 17 2021 8:57 PM

Manchu Mohan Babu Brother Ranga Swamy Passed Away At Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: టాలీవుడ్‌ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణంతో మోహన్ బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చదవండి: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నమూత

కాగా మంచు రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 8-9 గంటల మధ్య తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇక తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి.. మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement