ranga swamy
-
దిన్నెమీద గంగమ్మ లేఅవుట్ పరిశీలన
పీలేరు : మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను రాయచోటి ఆర్డీఓ రంగస్వామి పరిశీలించారు. దిన్నెమీద గంగమ్మ లేఅవుట్ జగనన్న కాలనీ, ఆటో నగర్లో ఆక్ర మణలు జరిగినట్లు కొత్తపల్లెకు చెందిన దేవేంద్రరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం ఆర్డీఓ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను ఆటో నగర్‌లోని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇది వరకే దిన్నెమీద గంగమ్మ లేఅవుట్లో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వీఆర్వో హేమంత్ నాయక్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఆసిఫ్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ స్థలాలను పరిశీలించారు. అలాగే మండలంలో ల్యాండ్ కన్వర్షన్ స్థలాలు పరిశీలించారు. పీలేరు పంచాయతీ సర్వే నెంబరు 42లో 3.60 ఎకరాలు, ముడుపులవేములలో సర్వే నెంబరు 405/3లో ఒక ఎకరా, బోడుమల్లువారిపల్లెలో సర్వే నెంబరు 731లో ఒక ఎకరా, 715లో రెండు ఎకరాలు, 711లో 90 సెంట్లు, 636లో 83 సెంట్లు, 639లో 1.84 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవి, ఆర్ఐలు రాజశేఖర్, భార్గవి, సర్వేయర్ దేవి పాల్గొన్నారు. -
మంచు మోహన్‌బాబు ఇంట తీవ్ర విషాదం
సాక్షి, తిరుపతి: టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మంచు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరుడి మరణంతో మోహన్ బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నమూత కాగా మంచు రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం 8-9 గంటల మధ్య తిరుపతి గోవింద ధామం వద్ద నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఇక తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి.. మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. -
Puducherry: కొలువుదీరిన రంగన్న కేబినెట్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో 55 రోజుల అనంతరం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని మంత్రి వర్గం కొలువుదీరింది. ఐదుగురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 40 ఏళ్ల అనంతరం ఓ మహిళ మంత్రి పగ్గాలు చేపట్టారు. పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయన కరోనా బారిన పడడం, ఆ తదుపరి పరిణామాలతో కొత్త కేబినెట్ కొలువులో జాప్యం నెలకొంది. బీజేపీతో చర్చలు ఫలించడంతో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం రాజ్ నివాస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నమశ్శివాయంతో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణన్, బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణన్ కుమార్‌కు, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన తేని జయకుమార్, చంద్ర ప్రియాంక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం అరగంటలో ముగించారు. దీన్ని డీఎంకే బహిష్కరించింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన బీజేపీ ఎమ్మెల్యే జాన్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. 1980–1983లో కాంగ్రెస్ డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకా అప్పాదురై మంత్రిగా పనిచేశారు. తర్వాత 40 ఏళ్లకు మహిళా మంత్రిగా చంద్ర ప్రియాంక పగ్గాలు చేపట్టారు. ఆమె కారైక్కాల్ ప్రాంతీయం నుంచి నెడుంగాడు రిజర్వుడు స్థానంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. విద్యావంతురాలైన చంద్రప్రియాంక మాజీ మంత్రి చంద్రకాశి కుమార్తె కావడం గమనార్హం. కాగా కేంద్రాన్ని డీఎంకే సర్కారు యూనియన్ ప్రభుత్వం (ఒండ్రియ అరసు) అని పిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పుదుచ్చేరిలో ప్రమాణ స్వీకార సమయంలో ఎల్జీ అదే పదాన్ని ఉపయోగించే రీతిలో ఇండియా ఒండ్రియం (భారత యూనియన్) పరిధిలోని పుదుచ్చేరి అని మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం గమనించదగ్గ విషయం. చదవండి: బంగారు పతకం గెలిస్తే రూ.3 కోట్లు -
Puducherry: 40 ఏళ్లకు మహిళా మంత్రి
పుదుచ్చేరిలో 40 ఏళ్ల అనంతరం ఓ మహిళ మంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ ఛాన్స్ కారైక్కాల్ నెడుంగాడు నుంచి గెలిచిన చంద్ర ప్రియాంకకు దక్కింది. మంత్రి వర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. సాక్షి, చెన్నై : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ఎట్టకేలకు 52 రోజుల తర్వాత మంత్రి వర్గం జాబితాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. జాబితాను ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. ఇందుకు కేంద్ర హోం శాఖ, రాష్ట్రపతి భవన్ ఆమోద ముద్ర వేశాయి. ఆదివారం సాయంత్రం 3 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం రాజ్ నివాస్‌లో జరగనుంది. బీజేపీకి చెందిన నమశ్శివాయం, సాయి శరవణన్ కుమార్, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మినారాయణన్, తేని జయకుమార్‌కు మంత్రి పదవులు దక్కాయి. 40 ఏళ్ల తర్వాత మహిళకు అవకాశం పుదుచ్చేరి మంత్రి వర్గంలో 40 ఏళ్ల అనంతరం ఓ మహిళకు చోటు దక్కింది. 1980– 1983లో కాంగ్రెస్– డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకఅప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మహిళలకు మంత్రి పదవులు దక్కలేదు. తాజాగా రంగన్న కేబినెట్లో కారైక్కాల్ ప్రాంతీయం నుంచి నెడుంగాడు రిజర్వుడు స్థానంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన చంద్రప్రియాంకకు మంత్రి పదవి దక్కింది. పదిహేను నిమిషాల్లో ప్రమాణ స్వీకారం ముగిసేలా రాజ్ నివాస్‌లో ఏర్పాట్లు జరిగాయి. వంద మందికి మాత్రమే అనుమతిచ్చారు. మాజీ మంత్రి, ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రాజవేలుకు పదవి దక్కని దృష్ట్యా ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే బీజేపీ నేత, ఎమ్మెల్యే జాన్‌కుమార్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చదవండి: మిషన్ 2022పై కమలదళం కసరత్తు -
Pondicherry: రంగన్న కేబినెట్ రెడీ
సాక్షి, చెన్నై: మంత్రివర్గ జాబితాను పుదుచ్చేరి సీఎం రంగస్వామి సిద్ధం చేశారు. బీజేపీకి చెందిన ఇద్దరితో పాటు తన పార్టీకి చెందిన ముగ్గురితో కలిపి ఐదుగురు సభ్యులకు మంత్రి చాన్స్ కల్పించారు. ఈ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించనున్నారు. పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌కాంగ్రెస్ అధినేత, సీఎం రంగ స్వామికి మంత్రివర్గం కూర్పు శిరోభారంగా మారింది. తొలుత బీజేపీతో సీట్ల పందేరం వివాదాల నడుమ సాగింది. అధికారపగ్గాలు చేపట్టి నెలన్నర రోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి. ఎట్టకేలకు బీజేపీకి చెందిన ఎన్బలం సెల్వం గత వారం స్పీకర్‌గా పగ్గాలు చేపట్టారు. మంత్రివర్గ పంచాయితీ కొలిక్కి రావడంతో జాబితా సిద్ధం చేసే పనిలో రంగన్న నిమగ్నం అయ్యారు. అదే సమయంలో తనకు మంత్రివర్గంలో చోటు దక్కడం లేదన్న సమాచారంతో బీజేపీకి చెందిన జాన్‌కుమార్ ఢిల్లీలో పైరవీలో మొదలెట్టే పనిలో పడ్డారు. అయితే ఎళ్ల తరబడి పార్టీ కోసం శ్రమిస్తున్న శరవణ కుమార్‌కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే రంగన్న జాబితాలోనూ ఆయన పేరు ఉండడం వెలుగు చూసింది. జాన్ కుమార్‌కు రిక్త హస్తం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతో పాటుగా తన కుమారుడ్ని ఎన్నికల్లో గెలిపించుకున్న నేత జాన్‌కుమార్. అయితే, ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కేది అనుమానంగా మారింది. ఆయన వర్గీయులు ఓ వైపు ఆందోళనలు సాగిస్తున్న నేపథ్యంలో మరో వైపు ఢిల్లీలో జాన్‌కుమార్ తిష్ట వేసి ఉండటం గమనార్హం. చివరి వరకు మంత్రి పదవి కోసం అధిష్టానంతో పోరాడుతానని జాన్‌కుమార్ ప్రకటించారు. సీఎం అభ్యర్థి కావాల్సిన వ్యక్తినని, బీజేపీ పిలుపు మేరకు ఇక్కడకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. జాన్‌కుమార్ ఢిల్లీ వేదికగా పైరవీలు ఓ వైపు సాగిస్తుంటే, మరో వైపు రంగన్న తన మంత్రి వర్గ జాబితాను సిద్ధం చేసి ఎల్జీకి సమర్పించేందుకు సిద్ధం కావడం గమనార్హం. జాబితాలో బీజేపీకి చెందిన నమశ్శివాయంకు హోంశాఖ, శరవణకుమార్‌కు ఆదిద్రావిడ సంక్షేమ శాఖ కేటయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, తన పార్టీకి చెందిన తిరుమురుగన్కు విద్యాశాఖ, లక్ష్మీనారాయణన్‌కు ఆరోగ్యశాఖ, జయకుమార్‌కు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించి ఉన్నట్టు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్‌గా రాజవేలు, ప్రభుత్వ విప్‌గా ఆర్ముగం పేర్లను ఎంపిక చేసి ఈనెల 24న ఎల్జీకి జాబితాను రంగన్న సమర్పించబోతున్నట్టు ఎన్‌ఆర్‌కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: శశికళతో మాట్లాడాడని.. కారుపై పెట్రోలు పోసి -
Puducherry: పట్టు వీడని రంగన్న..!
సాక్షి, చెన్నై : బీజేపీ డిమాండ్లకు తలొగ్గేది లేదన్నట్టుగా పుదుచ్చేరి సీఎం రంగస్వామి సంకేతలిస్తున్నారు. దీంతో స్థానిక బీజేపీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. పరిస్థితిని చక్క దిద్దేందుకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కేంద్రం రంగంలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – ఎన్‌ఆర్‌కాంగ్రెస్ కూటమి పుదుచ్చేరి అధికార పగ్గాలు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. పది స్థానాల్లో గెలిచిన ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న తమకు డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్‌తో పాటుగా, రెండు కీలక శాఖలతో కూడిన మంత్రి పదవుల్ని కట్ట బెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశం రంగస్వామిని సంకటంలో పడేసింది. అదే సమయంలో తమ బలాన్ని పెంచుకునే రీతిలో స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ వైపుగా బీజేపీ తిప్పుకోవడం వంటి పరిణామాల్ని రంగస్వామి నిశితంగానే పరిశీలిస్తూ వచ్చారు. ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి బీజేపీ బలం తాజాగా 12కు చేరడాన్ని రంగస్వామి తీవ్రంగానే పరిగణించి ఉన్నారు. దీంతో బీజేపీ ముఖ్య నేతలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వక పోవడం చర్చకు దారి తీసింది. ఢిల్లీలో చర్చోపచర్చలు.. పుదుచ్చేరి బీజేపీ నేత నమశ్శివాయం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ నిర్మల్‌కుమార్ సురానాతో పాటుగా పలువురు నేతలు ఆదివారం పదవుల పంచాయతీని ఢిల్లీకి తీసుకెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రంగన్న తీరుపై ఫిర్యాదు చేశారు. సోమవారం పుదుచ్చేరికి చేరుకున్న నేతలు రంగస్వామితో భేటీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో పుదుచ్చేరిలో పదువుల వివాదాన్ని పరిష్కరించేందుకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని కేంద్ర రంగంలోకి దించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మంగళవారం లేదా బుధవారం కిషన్‌రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. చదవండి: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోబోం: ఏఐఏడీఎంకే -
పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్
పుదుచ్చేరి:పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి కరోనా బారినపడ్డారు. ఈనెల 7వ తేదీ సాయంత్రం పదవీ ప్రమాణం చేసిన వెంటనే ఆయన విధుల్లో చేరారు. తాజాగా జ్వరం రావడంతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకుని.. పాజిటివ్‌గా తేలడంతో సోమవారం చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనతో సఖ్యతగా మెలిగిన ఎమ్మెల్యేలకు కూడా సోమవారం కరోనా పరీక్షలు చేశారు. ఈ కారణంగా ఈనెల 14వ తేదీన జరగాల్సిన మంత్రుల పదవీ ప్రమాణం కార్యక్రమం వాయిదాపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో పనిచేయాల్సి ఉన్నందున సీఎం ఆశీస్సులతో ఆదేరోజున ఉప ముఖ్యమంత్రి సహా నలుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అలాగే, అరియలూరు జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి శివశంకర్‌కు కరోనా సోకడంతో హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. చదవండి: రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి కేంద్రం చేసింది క్రూరమైన నేరం: సిసోడియా -
ఆకలవుతోంది.. లేమ్మా..!
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: చందమామ కథలు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తేనే కాని తినసి పసి కూనలు వారు. ఈ ఐదుగురికి అమ్మే ప్రపంచం. అయితే ఆ అమ్మ ఇకలేదని వారికి తెలియదు. ఆమె మృతదేహంపై వారు .. అమ్మా.. ఆకలవుతుంది.. అంటూ రోదిస్తుంటే స్థానికులు కంటతడి పెట్టారు. ఈ ఘటన నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. డోన్‌కు చెందిన వరలక్ష్మికి, దేవనగర్‌కు చెందిన రంగస్వామికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. రంగస్వామి బీరువాల తయారీ సంస్థలో కూలీగా పని చేసేవాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానంకాగా అందరూ ఆరేళ్లలోపు చిన్నారులు. వరలక్ష్మి వీరిని అల్లారుముద్దుగా పెంచేది. అయితే మూడేళ్ల క్రితం ఆమె ఆడపడుచు లక్ష్మిదేవి మృతి చెందడంతో, ఇద్దరు కుమారులు అనాథలయ్యాయి. వీరిద్దరినీ వరలక్ష్మి అక్కున చేర్చుకొని ప్రేమాభిమానాలను పంచిపెట్టింది. బిడ్డలకు ఏలోటు లేకుండా చూసుకునేది. శుక్రవారం రాత్రి ఇంటి వ్యవహారాల్లో వరలక్ష్మి, రంగస్వామిల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో వీరిద్దరూ ఘర్షణ పడ్డారు. మనస్తాపానికి గురైన వరలక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున ఇరుగుపొరుగు వారు ఆమె మృతదేహాన్ని ఫ్యాన్ నుంచి తొలగించారు. మృతురాలి భర్త పరారీలో ఉన్నాడు. అయితే ఈవిషయం తెలియని చిన్నారులు లే అమ్మా.. పాలు ఇవ్వు.. ఆకలవుతుంది.. అంటూ రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. త్రీటౌన్ సీఐ దైవప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులతో విద్యార్థుల వాగ్వాదం
ఎస్కేయూ, న్యూస్‌లైన్: వర్సిటీ వసతి గృహాల్లో విద్యార్థులకు గదులు కేటాయింపు సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు గదులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు వివిధ రూపాల్లో రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా అధికారులు స్పందించడంలేదని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వీసీ రామకృష్ణారెడ్డిని విద్యార్థులు ఘెరావ్ చేశారు. ఆ సమయంలో సోమవారం లోపు ప్రతి ఒక్క విద్యార్థికి వసతి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేదని విద్యార్థులు తెలి పారు. సోమవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ ఫణీశ్వరరాజు, వార్డన్ రంగస్వామి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జయరాజ్‌లు మహానంది వసతి గృహానికి చేరుకొని గదులులేని విద్యార్థుల పేర్లు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రతి గదికి వెళ్లిన ముగ్గురున్న చోట ఒకరికి చోటు కల్పించేందుకు సమాయత్తమయ్యారు. అయితే విద్యార్థులు మాత్రం కోర్సుల వారీగా గదులు కేటాయించాలని, లేనిపక్షంలో తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో రిజిస్ట్రార్ గోవిందప్ప హాస్టల్‌కు రావడంతో గదులు కేటాయించేందుకు ఎన్ని రోజులు కావాలంటూ ఆయనను నిలదీశారు. వసతిగృహాల విద్యార్థుల బాగోగులు చూడలేని అధికారులు పదవులకు రాజీనామాలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో వార్డన్ రంగస్వామి పదవికి రాజీనామా చేసినట్లు పేపర్‌పై సంతకం చేసి రిజిస్ట్రార్‌కు ఇవ్వగా ఆయన తిరస్కరించారు. నాన్బోర్డర్లను అధికారులే ప్రోత్సహిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. గదులు లేనివారికి ఇప్పుడే కేటాయించాలని లేనిపక్షంలో ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదని అడ్డుకున్నారు. రాత్రి వరకూ ఆందోళన కొనసాగింది.