సినీ నటుడు మంచు మోహన్ బాబు సిబ్బంది నిర్వాకం వల్ల ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్‌పల్లిలో మోహన్ బాబు నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆయన సిబ్బంది అడవి పందులను వేటాడారు. తన కుమారుడు మనోజ్ హెచ్చరించినా వారు మాట వినలేదని తెలుస్తోంది.
అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్లు మేనేజర్ కిరణ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని మనోజ్ అన్నాడు. ఆయనతో పాటు ఎలక్ట్రీషియన్ దుర్గా ప్రసాద్ కూడా ఉన్నాడని తెలిపాడు. వారిద్దరి చర్యలను తప్పుపడుతూ మంచి మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పారట. అడవి పందులను వేటాడొద్దని వారిద్దరినీ హెచ్చరించినప్పటికీ మాట వినలేదని మనోజ్ తెలుపుతున్నాడు. అయితే, ఆ సమయంలో మోహన్ బాబు అక్కడ లేరని తెలుస్తోంది.
మంచు ఫ్యామిలీలో గొడవల వల్ల జల్‌పల్లి నివాసం గురించి తెరపైకి వచ్చింది. అక్కడ జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్‌బాబు మీద కేసు కూడా నమోదు అయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు అరెస్టు విషయంలో ఎలాంటి ఆలస్యం లేదని, చట్ట ప్రకారమే అంతా జరుగుతోందని ఇప్పటికే రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment