తెలుగు దేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ చేతుల నుంచి బలవంతంగా లాక్కున్నాడని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత మంచు మోహన్ బాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎదుటి వారు బాగుంటే చంద్రబాబు ఓర్వలేరని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు వైఎస్ జగన్‌ని దొంగ అనటం తప్ప చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ఎం చేశారో ఇప్పటికైనా చెప్పాలని డిమాండ్ చేశారు.